బడ్జెట్ తో కమలానికి మరింత దూరం

బడ్జెట్ తో  కమలానికి  మరింత  దూరం
February 02 12:31 2018
విజయవాడ,
స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి విన్నవించుకున్నారు… 17 పేజీల రిపోర్ట్ ఇచ్చారు… కొత్తగా, ఆర్ధిక లోటుతో ఏర్పడిన రాష్ట్రానికి, అన్ని విధాలుగా ఆదుకోమన్నారు.. ప్రతి కేంద్ర మంత్రి దగ్గరకి వెళ్లారు… నాలుగు సంవత్సరాల నుంచి 42 సార్లు ఢిల్లీ వెళ్లారు… సహనంగా, ఓర్పుగా సాధిస్తాను… నేను ఆశావాదిని… కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనిశ్చితి మంచిది కాదు, అంటూ కేంద్రంతో సఖ్యతగా సాధించుకుందాం అని ఓర్పుగా ఎదురు చూసారు… అయినా, నాలుగేళ్ళ నుంచి అదే పాట… మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం అంటూ, పాడిందే పాట.. కాని, కేటాయింపులు మాత్రం, విదిలింపులే… ఇవాళ బడ్జెట్ తో, విషయం పూర్తిగా అర్ధమైపోయింది…రైల్వే జోన్ ప్రస్తావన లేదు… కాని పక్కన ఉన్న బెంగుళూరుకి మాత్రం 17 వేల కోట్లు ఇస్తారు… ఆర్ధిక లోటుకి ఏమి ఇవ్వరు.. కొత్త రాష్ట్రం అయ్యా, ఆదుకోండి అంటే, అందిరికంటే దారుణంగా చూస్తారు… రాష్ట్ర ప్రజల మూడ్ చంద్రబాబుకి అర్ధమైంది… ఇక సమరానికి సిద్ధమవుతున్నారు… అధికారులతో బడ్జెట్ పై మాట్లాడారు… రాష్ట్రానికి ఏమి వచ్చాయి, మనం ఏమి అడిగాం అనేది విశ్లేషిస్తున్నారు… ఎంపీలతో మాట్లాడారు… ఢిల్లీ నుంచి రండి, అంటూ ఆదివారం మీటింగ్ ఫిక్స్ చేసారు…కలిసి చర్చిద్దాం… ప్రజల మూడ్ కి తగ్గట్టు మనం నడుచుకోవాల్సిందే… అవసరమైతే మిత్ర పక్షంగా ఉంటూ, పార్లిమెంట్ లో బీజేపీ వైఖరి ఎండగడదాం అని మాట్లాడుకున్నారు… ఇప్పుడు ఈ విషయం చంద్రబాబుని దాటి పోయింది… ఆదివారం పెట్టే మీటింగ్ లో, చంద్రబాబు బీజేపీ కి చివరి నమస్కారం పెట్టి, ఇక పోరాడాలని ప్రజలు కోరుకుంటున్నారు… చంద్రబాబు లీడ్ తీసుకోకపోతే, ప్రజలే ముందుండి, బీజేపీ మెడలు వంచుతారు…కేంద్ర బడ్జెట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ పార్టీలు బడ్జెట్ పై పెదవి విరిస్తే… కమలం నేతలు చాలా బాగుందని కితాబునిస్తున్నారు. కానీ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ఊసే లేదు. ఏపీ విభజన హామీల సంగతి పట్టించుకోలేదు. ఫలితంగా ఏపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై చర్చలు జరుపుతున్నారు. టీడీపీ, వైకాపా ఎంపీలు ఎవరికి వారే భేటీలు ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ దిశగా పావులు కదుపుతున్నారు. పోలవరం, అమరావతి రాజధాని, విశాఖ రైల్వే జోన్, విభజన హామీలు, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పథకాల నిధుల సంగతి పట్టించుకోలేదు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఇంకోవైపు తెలంగాణకు అదే తీరులో అన్యాయం జరిగింది. ఈ దెబ్బతో టీడీపీ-బీజేపీ బంధం తెగే అవకాశముంది. కావాలనే ఏపీకి కేటాయింపులు లేకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్ణయం తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16784
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author