సామ్రాట్ స్టోరీ ఏమిటీ

సామ్రాట్ స్టోరీ ఏమిటీ
February 02 15:09 2018
హైద్రాబాద్,
పంచాక్ష‌రిలో అనుష్కతో క‌లిసి న‌టించిన సామ్రాట్ టాలివుట్ మంచిపేరే సంపాదించుకున్నాడు. అడ‌పాద‌డ‌పా సినిమాలో క‌నిపిస్తూ వ‌చ్చాడు. ఇప్పుడు ఆయ‌నను వైవాహిక జీవితం ఇర‌కాటం పెట్టింది. సామ్రాట్‌ని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేయడం ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అత‌నిపై వ‌ర‌క‌ట్న వేధింపుల కేసు న‌మోదైంది. ఇంట్లో చొర‌బ‌డి దొంగ‌త‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడ‌న్న‌ది అభియోగం. అయితే కొంత‌కాలంగా భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య విబేధాలు త‌లెత్తాయ‌ని టాక్‌. సామ్రాట్‌కి వివాహేత‌ర సంబంధాలున్నాయ‌ని, చెడు వ్య‌స‌నాల‌కు బానిస అయ్యాడ‌ని, అందులోంచి సామ్రాట్‌ని బ‌య‌ట‌కు లాక్కురావ‌డానికి ఇంట్లోవాళ్లు చాలా విధాలుగా శ్రమించి అల‌సిపోయార‌ని టాక్‌. నాలుగు రోజుల క్రితం… భార్య‌పై సామ్రాట్ దౌర్జ‌న్యానికి దిగాడ‌ని, సోమ‌వారం రాత్రి సామ్రాట్ మ‌రోసారి అలాంటి దాడి చేయ‌బోతే.. సామ్రాట్ భార్య‌, మావ‌య్య క‌ల‌సి క‌ట్టుగా ప‌ట్టుకుని పోలీసు స్టేష‌న్‌కి తీసుకొచ్చి పోలీసుల‌కు అప్ప‌గించార‌ని స‌మాచారం. అరెస్టు అయిన‌ సామ్రాట్‌కు బుధ‌వారం బెయిల్ మంజూరు అయింది. అయితే న‌టుడిపై కేసు పెట్ట‌డానికి పెద్ద త‌తంగ‌మే జ‌రిగింద‌ని తెలుస్తోంది. రాజ‌కీయ వ‌త్తిడితోనే పోలీసులు కేసు పెట్టిన‌ట్టు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. తెలంగాణ‌కు చెందిన ఓ మంత్రి ప్రోద్బలంతోనే తన కుమారుడు సామ్రాట్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన తల్లి జయారెడ్డి ఆరోపించారు. సామ్రాట్‌ పై నవంబరులో గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారని అక్కడి కౌన్సిలర్‌ల సలహా మేరకు భార్యభర్తలు తన కుమార్తె నివాసంలో ఉంటున్నారని చెప్పారు. ఫ్లాట్‌ కూడా తన కుమార్తెదేనని సొంతింట్లోకి సామ్రాట్‌ వెళ్లడం ట్రెస్‌ పాసింగ్‌ ఎలా అవుతుందని ప్రశ్నించారు. సామ్రాట్‌కు తెలియకుండా ఎలా సీసీ కెమెరాలుపెడతారని అడిగారు. రాజకీయ వత్తిడితో కేసులు పెట్టారని ఆవేధన వ్యక్తం చేశారు. సామ్రాట్‌ను వేధించేందుకు రాజ‌కీయ నాయ‌కులు ఎందుకురంగంలోకి దిగాల్సి వ‌చ్చింది అనేది అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గా మారింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16804
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author