హైద్రాబాద్ ఆఫీసుల్లో వర్టికల్ గార్డెన్

హైద్రాబాద్ ఆఫీసుల్లో వర్టికల్ గార్డెన్
February 02 19:45 2018
హైద్రాబాద్,
గ్రేటర్ కార్పొరేషన్ పచ్చదనంపై దృష్టి సారించింది. అందులో భాగంగా కేంద్ర కార్యాలయం మొక్కలు, పచ్చిక బయళ్లతో నిండిపోయింది. జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల్లోనూ వర్టికల్‌ గార్డెన్ అభివృద్ధి మొదలైంది. సౌర విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకూ రంగం సిద్ధమైంది. విద్యుత్తు పొదుపు మంత్రం సత్ఫలితాలు ఇస్తోంది.
భవన నిర్మాణాల పెరుగుదల నగరాన్ని కాంక్రీటు వనంలా తయారు చేస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వాతావరణ మార్పులు, భూతాపం, అధిక ఉష్ణోగ్రతలతో నగరవాసులు తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని నివారించడమే లక్ష్యంగా నిర్మాణ రంగంలో మార్పులు తెచ్చేందుకు భారతీయ హరిత నిర్మాణాల మండలి పలు మార్గదర్శకాలను రూపొందించింది. భవన సముదాయాలు, వాణిజ్య కేంద్రాలు, తదితర భారీ నిర్మాణాలు వాటికి అనుగుణంగా జరగాల్సి ఉంది. ఆయా నిబంధనల్ని భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో చేర్చామని, ఐజీబీసీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండే నిర్మాణ నమూనాలను ప్రోత్సహిస్తున్నామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది.కొత్త నిర్మాణాలు పర్యావరణహితంగా ఉండాలని చెప్పేముందు.. తమ కార్యాలయాలను ఆ స్థాయిలో తీర్చిదిద్దాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌.బి.జనార్దన్‌రెడ్డి గతేడాది నిర్వహణ విభాగాన్ని ఆదేశించారు. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం వేర్వేరు చర్యలు చేపట్టింది. సౌరవిద్యుత్తు ఉత్పత్తి కోసం సర్కిల్‌ కార్యాలయాలపై వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఏసీ వినియోగాన్ని తగ్గించడం, కార్యాలయాన్ని చెట్లు, మొక్కలు, పచ్చిక బయళ్లతో నింపడం వంటి చర్యలు అందులోనివే.ఏడు ఎకరాల విస్తీర్ణంలో 8 అంతస్తుల్లో కేంద్ర కార్యాలయం ఉంది. దీపాలు, యంత్రాల నిర్వహణతోపాటు 20,150 చ.అ విస్తీర్ణానికి ఏసీ సేవలు అందిస్తున్నాయి. వాటన్నింటికీ అయిన విద్యుత్తు వినియోగాన్ని పరిశీలిస్తే చదరపు అడుగుకు 119 యూనిట్ల విద్యుత్తు ఖర్చయింది. కేవలం ఏసీలకే ఏడాదికి రూ.51.78మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఖర్చవుతుంది. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు జనరేటర్‌ను ఉపయోగిస్తున్నామని, దాని ద్వారా మరో 1,26,000 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేశామని అధికారులు తెలిపారు. భవనం చుట్టూ 510 చ.మీల విస్తీర్ణంలో పచ్చదనాన్ని అభివృద్ధి చేశామని, అందులో 200 వృక్షాలు ఉన్నాయని అన్నారు. వాటి పెంపకానికి నెలకు 2.5లక్షల లీటర్ల నీటిని ఉపయోగిస్తున్నామన్నారు. ఈ తరహా సంస్కరణల్ని మరింత ముందుకు తీసుకెళ్లి చదరపు అడుగుకు అయ్యే విద్యుత్తు ఖర్చును 119 యూనిట్ల నుంచి 80 యూనిట్లకు తగ్గిస్తే బల్దియాకు ఐజీబీసీ నుంచి ‘సిల్వర్‌ రేటింగ్‌’ వస్తుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16810
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author