నరసరావుపేటలో మంత్రి నారాయణ పర్యటన

నరసరావుపేటలో మంత్రి నారాయణ పర్యటన
February 02 19:58 2018
గుంటూరు,
గుంటూరు జిల్లా నరసరావుపేట లో  మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, స్పీకర్ కోడెల శివప్రసాదరావు  పర్యటిచారు. మొదట నరసరావుపేట మున్సిపాలిటీ  అభివృద్ధి చేసిన స్మశాన వాటిక  స్వర్గపురి, పట్టణంలో రోడ్లను వాటి మధ్యలో గల డివైడర్ల లోని మొక్కల్ని సందర్శించారు.  తరువాత  మెప్మా బజారు, డ్వాక్రా భవనం సద్భావన్ కు  శంకుస్థాపన చేసి, ఎమ్మార్వో ఆఫీస్ లో గల విద్యుత్  సబ్ స్టేషన్ ను ప్రారంభిచారు. ఆ తరువాత నరసరావుపేట భువన చంద్ర టౌన్ హాల్ లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో  జరిగి కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి నారాయణను మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పురసన్మానం చేశారు.
స్పీకర్  కోడెల మాట్లాడుతూ  నరసరావుపేట పట్టణంలో సుమారు 10 కోట్ల రూపాయల తో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.  అందులో 5 కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం జరిగింది, నరసరావుపేట లో మొట్ట మొదటి సరిగా 50 షాపులతో మెప్మా  బజార్ కి శంకుస్థాపనజరిగిందని అన్నారు.  నరసరావుపేట ఇంకా ఎలా అభివృద్ధి చెందాలో అని అన్ని పార్టీలు,  ప్రజలు, ఉపాధ్యాయులు సలహాలు ఇవ్వాలని కోరారు. మరోసారి  నరసరావుపేట అభివృద్ధి ప్రణాళికను రూపొందిచడానికి ఈ సభను ఉపయోగించుకుందామని అన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండే మున్సిపాలిటీ లలో నరసరావుపేట మున్సిపాలిటీ అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం అని ,స్పీకర్ కోడెల 22 వేల మరుగుదొడ్లు కట్టారని తెలిసినప్పుడు సంతోషపడ్డాను. నేను ఒక మున్సిపల్ శాఖ మంత్రి గా ఉండి అధికారులు చేతిలో ఉండి ఎందుకు నేను కూడా ఈ కార్యక్రమం చేపట్టకూడదు  అనిపించింది.  వెంటనే  అధికారులని ఆదేశించడం జరిగిందని అన్నారు.  అతిత్వరగా మరుగు దొడ్లని పూర్తి చేయడం  జరిగింది. దానికి స్ఫూర్తి కోడెల శివప్రసాదరావు అని తరువాత మరుగుదొడ్లు కట్టడం లో భారతదేశం లో మొదట స్థానం లో ఆంద్రప్రదేశ్ ఉంది అని త్వరలోనే నరసరావుపేట మున్సిపాలిటీ కి 90 కోట్ల నిధులు మంజూరు చేస్తామని తెలియజేసారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16818
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author