ఇన్ టెక్ వెల్ మోటార్లను ప్రారంభించిన మంత్రులు

ఇన్ టెక్ వెల్ మోటార్లను ప్రారంభించిన మంత్రులు
February 02 22:25 2018
సంగారెడ్డి,
రూ. 1300 కోట్లతో నాలుగు నియోజకవర్గాలలోని 785 గ్రామాలకు త్రాగునీరు అందించే మిషన్ భగీరధ పథకం మోటార్లను మంత్రులు పొచారం శ్రీనివాస రెడ్డి, హరీష్ రావు లు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గాల ప్రజలకు త్రాగునీరు అందుతాయి.  సింగూర్ రిజర్వాయర్ నుండి నీటిని తీసుకునే  ఇన్ టెక్ వెల్ మోటార్ల ప్రారంభం. అదేవిధంగా పెద్దారెడ్డిపల్లి గ్రామం దగ్గరలో ఏర్పాటు చేసిన శుద్ది కేంద్రం నుండి నీటి పంపింగ్ ను మంత్రి పొచారం  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ MP  బిబీ పాటిల్,  ఎల్లారెడ్డి, జుక్కల్, నారాయణ ఖేడ్ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి, హన్మంత్ షిండే, భూపాల రెడ్డి ఉమ్మడి జిల్లాల ZP చైర్మన్ ధఫేదార్ రాజు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ యన్. సత్యనారాయణ పాల్గొన్నారు.మంత్రి పోచారం మాట్లాడుతూ 70 ఏళ్ళ స్వాతంత్య్రం తర్వాత నేడు దేశంలో ప్రారంభిస్తున్న ప్రతీ పని తెలంగాణలో ప్రారంభించిన పథకమే. 70 ఏళ్ళ నాడే ఇటువంటి ముఖ్యమంత్రి వచ్చి ఉంటే దేశం కష్టాలు తీరి ఉండేవని అన్నారు. 2019 ఎన్నికల నాటికి ఇంటింటికి త్రాగునీరు ఇస్తాం, ఇయ్యకపోతే  ఓటు అడగను అని ముఖ్యమంత్రి ప్రకటన చేసినప్పుడు అంతా అనుమానం, భయం వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి సమర్ధతపై నాకు నమ్మకం ఉందని అన్నారు. అనుకున్న సమయానికంటే ముందే పూర్తి అవడం ఆయన కృషికి నిదర్శనం. ఈ ప్రాజెక్టు త్వరితంగా పూర్తి చేయడానికి కష్టపడిన ఇంజనీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీ సిబ్బందికి ప్రజల తరుపున ధన్యవాదాలని అన్నారు. పిబ్రవరి చివరి నాటికి ఈ నీరు గ్రామాల్లోకి చేరుకుంటుంది. గ్రామాలకు చేరుకున్న నీటిని ఇంటింటికి చెర్చే బాద్యత స్థానిక ప్రజాప్రతినిధులది.  గ్రామాల్లో ఎవర్ హెడ్ ట్యాంకులు,  అంతర్గత పైప్ లైన్ పనులను త్వరితంగా పూర్తి చేయాలి. ఈ పథకం ద్వారా నాలుగు నియోజకవర్గాలలోని  2.5 లక్షల ఇళ్ళలోని 9 లక్షల జనాభాకు నీరు సరఫరా జరుగుతుందని మంత్రి అన్నారు. పథకం పనులు పూర్తిగా కంప్లీట్ అయినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేస్తామన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16852
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author