పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
February 03 13:51 2018

హైద్రాబాద్,
రాష్ట్రంలో క్రమేపీ చలి తగ్గుతోంది. ఉష్ణోగ్రతలూ పెరుగుతున్నాయి. అయితే తెల్లవారు జామునుంచి ఉదయం ఏడున్నర గంటల వరకు కొద్దిగా చల్లగా, మబ్బుగా ఉంటూ సూర్యోదయం తొందరగా కావడం లేదు. జనవరి  28 నుంచి వచ్చే ఫిబ్రవరి 3వ తేదీ వరకు 15 జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల సెల్సియస్ నుంచి 16 డిగ్రీల సెల్సియస్ వరకు, అత్యధిక ఉష్ణోగ్రతలు 31 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్ధ (టిఎస్‌డిపిఎస్) కన్సల్టెంట్  చెబుతున్నారు.అదేవిధంగా మిగతా 16 జిల్లాల్లో అత్యల్పం 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్‌గా, అత్యధికం 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఆయన వివరించారు. 31 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే 15 జిల్లాలు: హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంభ-గద్వాల, నల్లగొండ, యాదగిరి-్భవనగిరి, సూర్యాపేట, వరంగల్ (అర్బన్), వరంగల్ (రూరల్), జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం. 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే 16 జిల్లాలు: ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, మెదక్, సిద్దిపేట్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, జయశంకర్-్భపాల్‌పల్లి. వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండనుంది

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16871
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author