వ్యవసాయానికి పెద్ద పీట వేయాలి : ఉపరాష్ట్రపతి

వ్యవసాయానికి పెద్ద పీట వేయాలి : ఉపరాష్ట్రపతి
February 03 15:02 2018
గుంటూరు,
విద్య అన్నింటికంటే ముఖ్యమైనదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్వర్ణోత్సవాలను ప్రారంభించిన అనంతరం వెంకయ్య మాట్లాడారు. విద్య అన్నింటికంటే ముఖ్యమైనదని, విద్య ద్వారా ఎన్నో సమస్యలను పర్కిష్కరించుకోవచ్చునని ఆయన అన్నారు. . దేశం, సమాజం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని, చదువు చెప్పే గురువును గౌరవించాలని, గురువు లేకుండా గూగుల్ కూడా పనిచేయదని వెంకయ్య అన్నారు.
మన దేశం వ్యవసాయ ఆధారితమైనదని, వ్యవసాయం లాభసాటిగా మారి రైతు సంతోషంగా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అవిద్య, అవినీతి, అంతరాలు పోవాలని ఆయన అన్నారు. బడ్జెట్లో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం సంతోషమని, ఏడాది కాదు..15 ఏళ్లపాటు వ్యవసాయానికి పెద్దపీట వేయాలన్నారు.  రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలన్నారు. పంటకు నష్టం వస్తే వెంటనే పరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు.
దేశం ముందుకెళ్లాలంటే ప్రతి ఒక్కరి కృషి అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దేశభక్తి అంటే అన్ని రకాల ప్రజానీకాన్ని గౌరవించడమన్నారు. మన దేశ సంస్కృతిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. గురువు లేకుండా గూగుల్ పని చేయదని గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు. అవిద్య, అవినీతి, అంతరాలు, అరాచకాలు వంటి సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. స్వర్ణోత్సవాల్లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, మంత్రులు కామినేని, నక్కా ఆనందబాబు, ఎంపీ గల్లా జయదేవ్‌లు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16892
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author