బాలారిష్టాలు దాటని జనసేన

బాలారిష్టాలు దాటని జనసేన
February 05 13:25 2018
విజయవాడ,
జనసేన పార్టీ స్థాపించి నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆ పార్టీకి పటిష్టమైన కమిటీ లేకపోవడంతో ఆదిలోనే ఆ పార్టీ అభాసుపాలవుతోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగు రాష్ట్రాల్లో కమిటీ లేకపోవడం వల్ల నాయకత్వ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఈ క్రమంలో ఎవరికి వారే తామేనంటూ జనసేన కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనలు, సమావేశాలు నిర్వహిస్తుండగానే, మరోపక్క పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. కొంతమంది కార్యకర్తలు అనేక కేసుల్లో ఇరుక్కుంటున్నారు. మొన్న అనంతపురంలో ఒక నేత పలు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోగా, నిన్న తెలంగాణాలోని హైదరాబాద్‌లో భీమవరం నగరానికి చెందిన మరో నేత చీటింగ్ కేసులో ఇరుక్కున్నట్టు తెలిసింది. తాజాగా గుంటూరు జిల్లా బాపట్ల పట్టణానికి చెందిన మరో నేత మరో కేసులో ఇరుక్కున్నట్టు తెలిసింది. వీటి వివరాలిలా వున్నాయి. జనసేన పార్టీలో సేవాదళ్ మహిళా ఛైర్మన్ పదవిని రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఒక నేత ఆశిస్తున్నారు. ఈమె పవన్ కళ్యాణ్ అభిమానిగా గత నాలుగు సంవత్సరాలుగా రాజమహేంద్రవరం నగరంలోనూ, రూరల్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమెను రాష్ట్ర నాయకత్వంలోకి తీసుకుందామని పవన్ కళ్యాణ్, మారిశెట్టి రాఘవయ్య భావించారు. ఈ విషయాలను తెలుసుకున్న బాపట్లకు చెందిన నేత రాజమహేంద్రవరానికి చెందిన మహిళా నేతను పార్టీలో అణగదొక్కాలనే కృతనిశ్చయంతో ఫేస్‌బుక్‌లో పలు నకిలీ అకౌంట్లు సృష్టించిన విజయవాడకు చెందిన ఒక నేతను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. సదరు నేత గతంలో ఒక వెబ్ న్యూస్ ఛానల్‌ను ప్రారంభించి విజయవాడ నగరంలో పలువుర్ని బ్లాక్ మెయిల్ చేయడంతో కేసుల్లో ఇరుక్కుని, ఆ వెబ్‌సైట్‌ను మూసివేసి హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాను ఎంచుకుని పలువురి నాయకులను డబ్బు కోసం బెదిరించి వారిపై తన ఇష్టానుసారంగా పోస్టింగ్‌లు పెట్టేవాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఆ నేత, బాపట్లకు చెందిన మహిళా నేత కూడబలుక్కుని ఫేస్‌బుక్ ఆధారంగా ఆరోపణలకు తెరతీసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరానికి చెందిన మహిళా నేతపై పలు అసభ్యకరమైన పోస్టింగ్‌లను విజయవాడకు చెందిన నేత ఇతర నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లలో పెట్టేవాడని తెలిసింది. ఈ విషయాలను గ్రహించిన రాజమహేంద్రవరానికి చెందిన మహిళా నేత అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేసింది. వారు ఉదాశీనంగా వ్యవహరించడంతో రాజమహేంద్రవరం ప్రకాశంనగరం పోలీసు స్టేషన్‌లో ఏడుగురు ఫేస్‌బుక్ అకౌంట్లపై ఫిర్యాదు చేశారు. ఈమేరకు గుంటూరుకు చెందిన మహిళా నేతతో పాటు మరో ఆరుగురు నేతలపై కేసులు నమోదయ్యాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16959
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author