కుంతియాకు కలిసి రాని కాలం

కుంతియాకు కలిసి రాని కాలం
February 05 13:28 2018
హైద్రాబాద్,
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా. పాపం ఆయన్ను ఆ పార్టీ నేతలే పట్టించుకోవడం లేదు. రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన కసరత్తులు బాగానే చేస్తున్నాడు. పలు  కార్యక్రమాలకు రావాలని ఆయన పిలుస్తున్నా… సీనియర్లు పట్టించుకోవడం లేదు. నేతలతో ముఖాముఖి చర్చ కార్యక్రమానికి ఆయన ఆహ్వానించినా చాలా మంది రాలేదు. కుంతియాను అసలు ఇంచార్జ్ గా భావించడంలేదంటున్నారు. ఆయన్ను మేము పరిగణనలోకి తీసుకునేది లేదని కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడో చెప్పారు. అయినా ఏం చేయలేకపోయారాయన. ? తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కుంతియా అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. గాంధీ భవన్ లో కుంతియా అందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. చాలా మంది ఆయన పిలుపుకు స్పందించడం లేదు. హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నా…ఆయన వద్దకు రాలేదు.
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పార్టీ సీనియర్లు డీ.కే.అరుణ, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, రేవంత్ రెడ్డి, ముఖేష్ గౌడ్ లు ఆయన పిలుపుకు స్పందించలేదు. కుంతియాతో భేటీ వల్ల వచ్చే లాభం ఏంటనే ఆలోచనతో వారు దూరంగా ఉన్నారంటున్నారు. పార్టీ సంబందించిన అంశాలపై చాలాసార్లు కుంతియాతో మాట్లాడామని వారు చెబుతున్నారు. ఇంకోసారి అందరినీ పిలిచి ఆయన చేసేది ఏం లేదంటున్నారు. కుంతియాతో ఏవైనా విషయాలు మాట్లాడినా అవి రహస్యంగా ఉండే అవకాశాలు లేవు. అందుకే అతనితో మాట్లాడటం కంటే దూరంగా ఉండటమే మంచిదని వారు ఆలోచిస్తున్నారు. అందుకే ఆయనతో భేటీకి దూరంగా ఉన్నట్లు సమాచారం. గతంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ లు గా ఉన్న ఆజాద్, దిగ్విజయ్ సింగ్ లు ఎప్పుడు వచ్చినా క్యూ కట్టేవారు నేతలు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. నేను గాంధీ భవన్ కు వచ్చాను. మాట్లాడుకుందాం రమ్మని పిలిచినా ఎవరూ రావడం లేదు. ఆయన స్థానంలో మరొకరిని రాష్ట్ర ఇంఛార్జ్ గా నియమించేందుకు హైకమాండ్ సిద్దంగా ఉందనే సంకేతాలు రావడమే ఇందుకు కారణమంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16961
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author