క్లాస్ రూమ్ నుంచి ప్రజల్లోకి 

క్లాస్ రూమ్ నుంచి ప్రజల్లోకి 
February 05 16:34 2018
హైదరాబాద్
తెలంగాణ పునర్నిర్మాణం లో భాగంగా సాగునీటి రంగంలో జరుగుతున్న అనూహ్యమైన కార్యక్రమాలు, విజయాలను అధ్యయనం చేయాలని రాష్ట్రంలోని యూనివర్సిటీల సామాజిక శాస్త్రాల ప్రొఫెసర్ లు,టీచర్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి కోరారు.’మిషన్ కాకతీయ-సుస్థిర గ్రామీణాభివృద్ధి’సంకలనాన్ని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదివారం జలసౌధ లోఆవిష్కరించారు.కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ టి. శ్రీనివాస్ ఈ సంకలనానికి సంపాదకత్వం వహించారు.
” వ్యవస్థలు సక్రమంగా పని చేయడంతో పాటు ఆ వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాలి”అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు ఘంటా గుర్తు చేశారు. ప్రాజెక్టుల రీ డిజైనింగుతో తెలంగాణ పునర్నిర్మాణం ప్రారంభమైందన్నారు.తెలంగాణ సమాజం రూపు రేఖలు అతిత్వరలో మారతాయన్నారు. మిషన్ కాకతీయ వల్లగ్రామీణ తెలంగాణలో సామాజిక, ఆర్ధిక రంగాల్లో ఇప్పటికే అనూహ్యమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నట్టు టి.ఎస్.పి.ఎస్.సి.చైర్మన్ తెలిపారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను,మిషన్ కాకతీయ పథకాల అమలు తీరును సామాజిక శాస్త్రవేత్తలు, అధ్యాపకులు  క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. ఇటువంటి పరిశీలన,వారు సమర్పించే నివేదికలు ప్రామాణికంగా ఉంటాయని చక్రపాణి తెలిపారు.ప్రాజెక్టు లు, చెరువుల పునరుద్ధరణ కేవలం వ్యవసాయ రంగానికి పరిమితము కాదని తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయన్నారు.మిషన్ కాకతీయను అమెరికాకు చెందిన  రెండు యూనివర్సిటీలు స్టడీ చేస్తుప్పుడు మన యూనివర్సిటీలు ఆ పని ఎందుకు చేయకూడదని అన్నారు. తరగతి గదుల నుంచి,పంట పొలాలకు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళాలని ప్రొఫెసర్లు, మేధావులకు ఘంటా విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి  చేసిన రీ డిజైన్స్ వల్ల జరుగుతున్న ప్రయోజనాలు, మిషన్ కాకతీయ ప్రభావంపై లోతుగా అధ్యయనం చేయవలసిన సామాజిక బాధ్యత సోషల్ సైన్సెస్ టీచర్లపై ఉందని ఆయన అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17013
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author