మహిళా సంఘాలకు ఆర్ధిక వెసులుబాటు

మహిళా సంఘాలకు ఆర్ధిక వెసులుబాటు
February 05 22:29 2018
వనపర్తి,
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీ) రూ.2వేల కోట్ల నిధులు విడుదల చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. సోమవారం నాడు వనపర్తిలో కాంగ్రెస్ మహిళా గర్జన సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న ఉత్తమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సెర్ప్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామన్నారు. ప్రతి గ్రూపు సభ్యులకు రూ.లక్షకు తగ్గకుండా రివాల్వింగ్ ఫండ్ ఇస్తామన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల మహిళ జనాభా ఉన్న మంత్రి వర్గంలో స్థానం కల్పించని ప్రభుత్వం టిఆర్ఎస్.. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించని దౌర్భాగ్య ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని విమర్శించారు.
2019 లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.. మహిళలకు అభయ హస్తం కింద వెయ్యి రూపాయలు ఇస్తాం.. మహిళా సహకార సంఘంలో ఉన్న ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాం.  నాలుగు లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం.. ప్రతి మహిళ సంఘానికి లక్ష రూపాయల రివల్వింగ్ ఫండ్ ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ప్రభుత్వం 70 లక్షల సహకార సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదు.. 2 వేల కోట్ల రుణాలు మహిళల సంఘాలకు ఇవ్వకపోవడం దారుణం. వడ్డీ లేని రుణాలు 2 వేల కోట్ల రూపాయలు అధికారంలోకి రాగానే అందజేస్తాం.. ప్రతి మహిళా సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం.. మహిళ సంఘాలకు గ్రామీణ స్థాయిలో 15 లక్షలతో మండల కేంద్రాల్లో 30 లక్షల నిధులతో భవనాలు నిర్మిస్తాం.. మహిళా సంఘాల ఆర్గనైజర్లకు నెలకు పది వేల రూపాయలు ఇస్తామని ఉత్తమ్ అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17048
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author