మెట్రో స్టేషన్లో…మంటలు

February 06 15:25 2018
హైదరాబాదు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు మెట్రో రైల్ భద్రతా ఏర్పాట్లపై ఆదినుంచి వ్యక్తమౌతున్న ఆందోళన నిజమైంది. గాల్లో తేలియాడే పట్టాలు, స్టేషన్లలో అకస్మాత్తుగా ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తే…అనుకోని విధంగా అగ్నిప్రమాదం సంభవిస్తే ఎలా? అనే అనుమానం నిజమైంది. ఇటీవల మెట్రో రైలు నగరంలో ప్రారంభమైంది, తొలి దశలో నాగోల్ నుంచి మియాపూర్ దారా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అక్కడి సమస్యలు ఒక్కొక్కటిగా అనుభవంలోకి వస్తున్నాయి.వాటిని మెట్రో అధికారులూ పరిష్కరిస్తున్నారు. ఇదిలాఉంటే మరికొన్నాళ్ళలో ప్రజలకు అందుబాటులోకి రానున్న మార్గాల్లో భద్రతా వైఫల్యాలు బయట పడుతున్నాయి. నిర్మాణ దశలో ఉన్న హైటెక్ మెట్రో రైల్ స్టేషన్ లో కొద్దిసేపటి క్రితం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుని మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అయితే ఈ ప్రమాదం ఎలాజరిగిందో వివరాలు తెలియాల్సిఉంది. ఆ మార్గం నిర్మాణ దశలో ఉండి రైల్ అందుబాటులోకి రాకపోవడంతో ఆస్తి నష్టం మినహా పెద్దగా ఇబ్బందేమి లేకపోవడంతో స్తానిక ప్రజలు ఊపిరి తీసుకున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17094
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author