ప్రధానితో కేంద్రమంత్రి సుజనా చౌదరీ భేటీ

ప్రధానితో కేంద్రమంత్రి సుజనా చౌదరీ భేటీ
February 06 15:43 2018
న్యూఢిల్లీ,
ప్రధానమత్రి నరేంద్ర మోడీతో మంగళవారం ఉదయం కేంద్రమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీలో పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను మోదీకి వివరించారు. విభజన సమస్యలు, కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని కుడా అయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
మంగళవారం  ఉదయం ముఖ్యమంత్రి సూచన మేరకు సుజనాచౌదరి ప్రధానిని కలిశారు. 32 నిమిషాల పాటు ఆయనతో సమావేశమైన విభజన సమస్యలు, ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. విభజన హామీలతోపాటు పలు అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం.
మిత్రపక్షంగా మేము మీకు సహకరిస్తున్నాం. అన్ని విషయాల్లోనూ మీ వెన్నంటే ఉన్నాం. అయితే దీనికి భిన్నంగా కేంద్రం ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని  కేంద్రమంత్రి ప్రధానికి చెప్పినట్లు సమాచారం. .. కేంద్రానికి అన్ని విషయాల్లో సహకరిస్తున్నా ఏపీ విషయంలో మాత్రం వివక్ష కొనసాగుతోంది. రాజధాని శంకుస్థాపన సమయంలో ఇచ్చిన వాగ్ధానాలన్నీ అలాగే వుండి పోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కుడా మిమ్మల్ని కలిసి అనేక విషయాలు ప్రస్తావించారని  సుజనాచౌదరి ప్రధానికి గుర్తు చేసారు. ఏపీకి న్యాయం చేస్తాం.. తొందరపడవద్దని సుజనాకు మోదీ హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనికి మోదీ స్పందిస్తూ… అన్ని విషయాలు పరిష్కరిస్తామని, ఆందోళన విరమించాలని కోరినట్లు సమాచారం. అయితే ఆ ఆంశం తన చేతిలో లేదని సుజనా ప్రధానికి స్పష్టం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబుతో తానే స్వయంగా మాట్లాడతానని మోదీ చెప్పినట్లు సమాచారం. అవసరమైతే చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడతానని మోదీ చెప్పినట్లు తెలియవచ్చింది. ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమని, న్యాయం చేస్తామని, ఏ విషయంలోనూ తొందరపడవద్దని సుజనాకు ప్రధాని హామీ ఇచ్చారు.   మరోవైపు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17101
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author