మళ్లీ మొదలయింది అయేషా హత్యకేసు

మళ్లీ మొదలయింది అయేషా హత్యకేసు
February 06 15:58 2018
విజయవాడ,
ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా మీరా  హత్యకేసు విచారణ మళ్లీ మొదలయ్యింది . ఇబ్రహింపట్నలంలోని  నిమ్రా ఫార్మసి కళాశాలలో బి ఫార్మసి ప్రధమ సంవత్సరం చదువుతున్న ఆయేషామీరా పదేళ్లకిందట ఒక రాత్రి  దారుణంగా హత్యకు గురయింది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధిచి మొదట క్రింది కోర్టు సత్య౦బాబు కు యావజ్జీవ శిక్ష విది౦చగా, తరువాత హైకోర్టు సత్య౦బాబును నిర్దోషిగా గత ఏడాది ఏప్రిల్ 30 విడుదల చేసింది.  దీ౦తో విజయవాడ పోలీసులకు ఆయేషామీరా హత్యకేసు సవాల్ గా నిలిచి౦ది. అసలు దోషులను పట్టుకోవాల౦టూ కొ౦తమ౦ది సామాజిక కార్యకర్తలు హైకోర్టులో కేసు పిల్ చేయడ౦తో విచారణ చేసి అసలు దోషులను పట్టుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశి౦చి౦ది. దీ౦తో విజయవాడ సిపి గౌత౦ సవా౦గ్ నేతృత్వంలో విచారణ చేయడానికి ప్రత్యేక విచారణ బృందం (సిట్) ను ఏర్పాటు చేశారు. విచారణ హైకోర్టు అధ్వర్యంలో జరగాలని కోర్టు ఆదేశించింది.  సిట్ అధికారి విశాఖ రేంజ్ డిఐజి శ్రీ కాంత్ తన బృందం తోమంగళవారం నాడు  ఇబ్రహీంపట్నం మండలం లోని దుర్గా లేడిస్ హష్టల్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17104
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author