కృష్ణమానాయుడు మృతికి గవర్నర్, సీఎం సంతాపం

కృష్ణమానాయుడు మృతికి గవర్నర్, సీఎం సంతాపం
February 07 11:28 2018
అమరావతి,
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సంతాపం తెలిపారు. ముద్దుకృష్ణమ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టీడీపీ సినీయర్ నేత ముద్దుకృష్ణమనాయుడు హఠాన్మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.  తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ముద్దుకృష్ణమనాయుడిది ముఖ్య భూమిక  అయన అన్నారు. క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ పార్టీకి, ప్రజలకు ముద్దు కృష్ణమనాయుడు చేసిన సేవలు మరచిపోలేనివని కొనియడారు. ముద్దుకృష్ణమనాయుడు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముద్దు కృష్ణమనాయుడు మృతి తో  చంద్రబాబు బుధవారం నాటి  సమావేశాలు, పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17160
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author