టీటీడీపీలో మాజీ ఎమ్మెల్యేలు

టీటీడీపీలో మాజీ ఎమ్మెల్యేలు
February 07 11:40 2018
హైద్రాబాద్,
 వలసలతో కుదేలైన టీటీడీపీలో మళ్ళీ ఉత్సాహం తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. నాయకుల ఫిరాయింపులతో దెబ్బతిన్న టీడీపీ తిరిగి అలాంటి వ్యూహాంతోనే బలపడటానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఇతర పార్టీల్లో ఇమడలేకపోతున్న నాయకులను పార్టీలోకి తీసుకువచ్చేందుకు నేతలు చర్చలు జరుపుతున్నారు. చాలా కాలానికి ఓ మాజీ ఎమ్మెల్యే పసుపు కండువా కప్పుకోవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా ఉన్నారు. మరో వైపు పార్టీ కార్యక్రమాలపై జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. 13 మంది ఎమ్మెల్యేలు, వందల సంఖ్యలో నేతల వలసలతో తీవ్రంగా దెబ్బతిన్న టీటీడీపీ తిగిరి లేచి నిలబడటానికి ప్రయత్నాలు చేస్తోంది. ఉన్న నేతలను కాపాడుకుంటూ, కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపడానికి ఇప్పటికే పలు కార్యక్రమాలతో టీటీడీపీ ముందుకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమంతో జనం వద్దకు టీడీపీ నేతలు వెళ్తున్నారు. ఎన్నికల నాటికి మరింత బలం పుంజుకోవడం ద్వారా నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని టీటీడీపీ శ్రమిస్తోంది. తమ పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలను ఆకట్టుకునేందుకు టీటీడీపీ ప్రయత్నిస్తోంది. నియోజకవర్గాల్లో బలంగా ఉన్న నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య  పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు. గతంలో సిపిఎం తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన పుల్లయ్య డోర్నకల్ లో చురుకుగా వ్యవహారిస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులంతా టీఆర్‌ఎస్ లో చేరడంతో ఆయనను పార్టీలోకి తీసుకోవాలని నాయకత్వం నిర్ణయించింది. పుల్లయ్య తో పెద్ద ఎత్తున ఆయన అనుచరులు కూడా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరనున్నారు. త్వరలోనే మరో మాజీ ఎమ్మెల్యే కూడా తెలుగుదేశంలో చేరనున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి భారీ ఎత్తున చేరికలుంటాయని పార్టీ నేతలు చెపుతున్నారు. మరో వైపు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బుదవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు వస్తున్నారు. పార్టీ పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో ఆయన సమావేశం కానున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులతో కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పల్లెపల్లెకు తెలుగుదేశంతో పాటు ఇతర కార్యక్రమాలపైన ఆయన సమీక్ష నిర్వహిస్తారు. పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్య చేసిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులును ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. తన వ్యాఖ్యలపైన ఆయన ఇప్పటి వరకు వివరణ ఇవ్వకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నిర్ణయించారు. అయితే మోత్కుపల్లి మాత్రం మౌనముద్రను కొనసాగిస్తున్నారు. ఆయన చంద్రబాబుతో సమావేశం అవుతారా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17166
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author