బాబుకు పెరుగుతున్న మద్దతు

బాబుకు పెరుగుతున్న మద్దతు
February 07 13:25 2018
న్యూఢిల్లీ,
తృణమూల్ కాంగ్రెస్ టీడీపీకి మద్దతునిచ్చింది. పార్లమెంటు వేదికగా ఏపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు వారి బాసటగా నిలిచారు. ప్రధాని మోడీ పేరు చెబితేనే ఒంటి కాలి మీద లేస్తారు మమత బెనర్జీ. పశ్చిమ బెంగాల్ కు ఇలానే నిధులు ఇవ్వకుండా మోడీ అన్యాయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అందుకే దీదీకి ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. కేంద్రబడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిన వైనంపై టీడీపీ, వైకాపాలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా టీడీపీకి శివసేన, అకాలీదళ్ లు మద్దతు పలికాయి. ఇప్పుడు వారితో జత కలిశారు మమతా బెనర్జీ. కాంగ్రెస్ జట్టులో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను దారిలోకి తెచ్చేందుకు మోడీ ప్రయత్నించినా ఆ పార్టీ నేతలు లొంగలేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోని పార్టీలో ప్రధాని మోడీ తీరును తప్పుపట్టాయి. అది యూపీఏ కూటమికి వరంగా మారింది. మేము పోరాటం చేయడం కాదు.. ఆ కూటమిలోని నేతలే ఆందోళన చేస్తున్నారు చూడండని చెబుతున్నారు వాళ్లు.
పార్లమెంటు వేదికగా స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళన చేస్తున్న నేతలు నినాదాలు ఇవ్వడం బీజేపీకి ఇబ్బందిగా మారింది. అయినా సరే వారు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. నారదుడి వేషంలో ఉన్న శివ ప్రసాద్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో సభ్యులు నినాదాలు చేయడంతో అందరికీ విషయం అర్థమైంది. తెలుగువాడి సత్తా ఏంటో చూపిస్తామంటూ సభ్యులు ఆందోళన చేయడం ఉత్తరాది నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. నిధులన్నీ గుజరాత్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలకేనా.. మాకు లేవా అంటూ నినాదాలు చేశారు.
శివసేన నేతలతో ఫోన్ మాట్లాడిన చంద్రబాబు మరోవైపు యుపిఏ కూటమి సభ్యులను కదిలిస్తారనే భయం బీజేపీకి పట్టుకుందంటున్నారు. అందుకే  టీడీపీ చేసే ఆందోళనను సీరియస్ గా తీసుకుని పరిశీలించే ప్రయత్నం చేస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17183
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author