కందుల కొనుగోళ్లలో అక్రమాలు

కందుల కొనుగోళ్లలో అక్రమాలు
February 07 14:00 2018
అదిలాబాద్,
ఆదిలాబాద్ జిల్లాలోని మార్కెట్‌యార్డుల్లో కందుల కొనుగోళ్ళు అక్రమాలకు తెరలేపుతున్నాయి. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న మద్దతు ధరను తెలివిగా దళారులు సొమ్ముచేసుకుంటూ మహారాష్ట్ర నుండి యదేచ్చగా జిల్లాకు కందులు రవాణా చేస్తూ లక్షల్లోగడిస్తున్నారు. రై తుల కష్టాని సొమ్ముచేసుకుంటూ అక్రమార్కులకు కందుల కొనుగోళ్ళు వరంలా మారుతున్నాయి. రైతుల వద్ద తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ బినామీ పేర్లతో తిరిగి అదే పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలిస్తూ రిసైక్లింగ్ ద్వారా అందినకాడికి దండుకుంటున్నారు. ఈ ఏడు వాతావరణం అనుకూలించడంతో అంతర్‌పంట కింద ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 71,890 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 67వేల ఎకరాల్లో, ఆసిఫాబాద్ జిల్లాలో 54 వేల ఎకరాల్లో కంది పంట సాగుచేశారు. తద్వారా 4లక్షల 30వేల క్వింటాళ్ళ కందుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వే శారు. అయితే జిల్లాలోని మార్కెట్‌యార్డులో మార్క్‌ఫెడ్ ద్వారా కందుల కొనుగోళ్ళు ప్రారంభించగా కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.5,400 చొప్పున కొనుగోలు చేశారు. మహారాష్టల్రో మా త్రం క్వింటాలు మద్దతు రూ. 4,300 ఉండడంతో దళారులకు ధరల వ్యత్యాసం కాసుల పంటను కురిపిస్తోంది. ప్రతి రోజు మద్యదళారులు అధికారుల అండదండలతోనే వాహనాల్లో మహారాష్ట్ర నుండి నిలువలను జిల్లాకు తెప్పించి అక్రమ కొనుగోళ్ళకు తెరలేపుతున్నారు. ఒక్కో క్వింటాలుకు 1100 నుంచి రూ.1200 వరకు గిట్టుబాటు కావడంతో ఈ లెక్కన దళారులు రోజుకు 20వేల నుంచి 30వేల కందులను దొడ్డదారిన సంపాదించుకుంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించే కందులకు అధికారులు దృవీకరణతో పాటు కూపన్లు జారీ చేయాల్సి ఉంటుంది. వి ఆర్‌వోతో పాటు వ్యవసాయ అధికారి ధృవీకరిస్తేనే కొనుగోళు కేంద్రాల్లో కందులను విక్రయించే అవకాశం ఏర్పడుతుంది. పట్టాపాసుబుక్ కలిగి ఉన్న రైతులు కంది పంట పండించకపోయినా బినామీ పేర్లతో అధికారులతో కుమ్మక్కై మద్యదళారులతో కొనుగోళ్ళకు తెరలేపుతున్నారు. ఎకరాకు సరాసరి 5 క్వింటాళ్ళ వరకు కొనుగోలు చేసే అవకాశం ఉండడంతో ఇదే అదనుగా అధికారులు బినామీ రైతుల పేరిట అక్రమ వ్యాపారం దర్జగా కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ఇచ్చోడ, సారంగపూర్, తాంసి, జైనథ్, ఆసిఫాబాద్, ఉట్నూరు, భైంసా, కుబీర్ మండలాల్లో అక్రమ కందుల కొనుగోళ్ళ వ్యాపారం జోరుగా సాగుతున్నప్పటికీ ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఫోర్స్ బృందాలు చోద్యం చూస్తున్నాయనే ఆరోపనలు వస్తున్నాయి. కందుల వ్యాపారులతో అధికారులు కుమ్మక్కై రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఒకే రోజు కలెక్టర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించే ఒకే రోజు 2వేల క్వింటాళ్ళ అక్రమ కందుల నిల్వలు బయటపడగా నిందితులపై ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిర్మల్‌లోనూ మార్క్‌ఫెడ్ అధికారులు బినామీ వ్యాపారులతో కుమ్మక్కై అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా సరిహద్దులో నిఘా పెంచి కొనుగోలు కేంద్రాల వద్ద బినామీలను పక్కనపెట్టి అర్హులైన రైతులకే న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17198
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author