తరలిపోతున్న గొర్రె పిల్లలు

తరలిపోతున్న గొర్రె పిల్లలు
February 07 14:04 2018
పాలమూరు,
 యాదవులకు ప్రభుత్వం జీవనోపాధి కింద గొర్రెలను పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకానికి కొందరు దళారులు లబ్ధిదారులతో కలిసి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వం గొర్రెల కాపరులకు ఒకయూనిట్ కింద 21గొర్రె పిల్లలను పంపిణీచేసే కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. అందులో 20 ఆడగొర్రె పిల్లలు కాగా ఒకటి మగ పొట్టెలు గొర్రెపిల్లను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం ఈ 21 గొర్రెపిల్లలను ఎక్కడ కూడా లబ్ధిదారులు విక్రయించుకోకూడదని నిబంధనాల్లో స్పష్టంగా చెప్పింది. ఎవరైన నిబంధనాలకు విరుద్దంగా 21గొర్రెపిల్లల్లో ఒక్క గొర్రెపిల్లను కూడా విక్రయించినట్లు అయితే చట్టరిత్య చర్యలు ఉంటాయని ప్రభుత్వం విడుదల చేసిన జిఓలో పేర్కొంది. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ఇప్పటికే 800 యూనిట్లకుపైగా లబ్ధిదారులకు గొర్రెపిల్లలను పంపిణీ చేసింది. కార్యక్రమాన్ని మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు ఎంతో అట్టహాసంగా శ్రీకారం చుట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికిని లబ్దిదారుల చేతుల్లోకి గొర్రెపిల్లలు వెళ్లగానే అసలు కథ మొదలైంది. ఒక్కసారిగా మధ్య దళారులు, బ్రోకర్లు ప్రభుత్వ పథకానికి తూట్లు పొడిచేందుకు రంగంలోకి దిగారు. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ మండలాల్లో గొర్రెపిల్లలను మార్కెట్‌లోకి తరలించే ప్రక్రియను చేపట్టారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, అధికారులు మార్కెట్‌లోకి తరలిస్తున్న గొర్రెపిల్లలను పట్టుకున్నారు. దీంతో అసలు కథ గుట్టురట్టైంది. వందలాది గొర్రెపిల్లలను పోలీసులు పట్టుకుని రోజుల తరబడి పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచుకోవల్సిన దాఖలాలు నెలకొన్నాయి. ఈ ఘటనలు వెలుగు చూడడంతో పోలీసులు, ప్రజలు ఆశ్చర్యానికి గురైయ్యారు. ఇతర రాష్ట్రాల నుండి ఎంతో వ్యయప్రయాసాలతో పథకం ఆమలుకు గొర్రెపిల్లలను తీసుకువస్తే ఇలాంటి కార్యక్రమాలకు దళారులు దిగడంతో పోలీసులు ఈ విషయాన్ని సిరియస్‌గా పరిగణించారు. పలు పోలీస్‌స్టేషన్లలలో కేసులు కూడా నమోదు చేశారు. తరచూ ఈసంఘటనలు చోటు చేసుకుంటుండడంతో నాలుగు జిల్లాల పశుసంవర్థకశాఖ అధికారులు నివ్వెర పోవడమే కాకుండా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గొర్రెల పంపిణీ పథకానికి తూట్లు పడుతున్నాయనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికిని ప్రభుత్వం ఎదైతే కురుమయాదవుల జీవన ప్రమాణాలను పెంచడానికి, వారిని ఈ పథకం ద్వారా ఆర్థికాభివృద్దికి పెంపొందించేందుకు చేస్తున్న కృషికి జిల్లాలో అక్కడక్కడ తూట్లు పొడుస్తుండడంతో ఈ పథకం అమలుపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తున్నాయి
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17201
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author