ఉద్యమంగా రాష్ట్ర అభివృద్ధి : మంత్రి లక్ష్మారెడ్డి

ఉద్యమంగా రాష్ట్ర అభివృద్ధి : మంత్రి లక్ష్మారెడ్డి
February 07 15:00 2018
మెదక్,
తెలంగాణలో అభివృద్ధి ఉద్యమంలా సాగుతున్నది. 40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం నాడు అయన మెదక్ జిల్లా మెదక్ మండలం మాచవరంలో లబ్ధిదారులకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, 48 యూనిట్ల గొర్రెలను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి పంపిణీ చేసారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సారథి, ప్రభుత్వాధినేత కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు.  తెలంగాణ సాధన ఒక దశ, తెలంగాణ పునర్నిర్మాణం రెండో దశ ఉద్యమమని అన్నారు.  పెన్షన్ల కింద ఒక్క మాచవరం గ్రామానికి కోటి రూపాయలకు పైగా నిధులు అందాయి.  తాజాగా గొర్రెల పంపిణీ జరిగింది. జిల్లాలో అనేక హాస్పిటల్స్ ని అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ ని ఏర్పాటు చేస్తున్నాం.  డియాలిసిస్ కేంద్రాన్ని ప్రారంభించాం.  24గంటల విద్యుత్, రైతాంగానికి పంటకు రూ.4 వేల పెట్టుబడులు అందిస్తున్న రాష్ట్రం దేశంలో లేదని అన్నారు.  అనేక ప్రభుత్వ పథకాలను అడ్డగోలుగా అడ్డుపడుతున్న కాంగ్రెస్ నేతలు, మరి ఆనాడు కరెంటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలి.  ప్రజల కోసం పాటు పడుతున్న ప్రభుత్వాలను పది కాలాల పాటు కాపాడుకోవాలని అన్నారు.
పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ  గతంలో ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా పని చేయలేదని అన్నారు. అహర్నిశలు ప్రజల కోసం పరితపించే సీఎం, మంత్రులు, ఎమ్మల్యేలు మనకు ఉండటం మన అదృష్టం. ఈ ప్రభుత్వాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రజల దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో  టీఎస్ ఎం ఐ డీసీ   చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17228
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author