నిరసనలలో అశాంతి వుండోద్దు : సీఎం

నిరసనలలో అశాంతి వుండోద్దు : సీఎం
February 08 11:30 2018
అమరావతి,
ఎపిలో జరుగుతున్న బంద్పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబాయ్నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిరసనలకు టిడిపి సంఘీభావం ఉంటుందని ఆయన చెప్పారు. అత్యవసర సేవలకు విఘాటం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో బుధవారం నాడు  మన ఎంపీలు  బాగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగే వరకూ పార్లమెంటులో పోరాడాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంటులో నిరసనలు ఉధృతం చేయాలని ఆయన సూచించారు. ఎపి అంటే కేంద్రానికి లెక్కలేనితనంగా ఉన్నప్పుడు పోరాడాల్సిందేనని ఆయన అన్నారు. ఎపికి జరిగిన అన్యాయంపై ఎంపిలందరికీ బుక్లెట్లు పంచిపెట్టాలని ఆయన సూచించారు.
విభజన సమయంలో వైసిపి కేసుల కోసం లాలుచీ  పడింది. మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదని అయన అన్నారు. ఎక్కడైనా ప్రతిపక్షం ముందు ఉండి ఆందోళనలు చేయాలి. కేసుల భయంతో వైసిపి కి ఆ పరిస్థితి లేదని అయన అన్నారు. విభజన లో కాంగ్రెస్ అన్యాయం చేసిందని బిజిపి  కి మద్దతు ఇచ్చాం. నాలుగేళ్ళు  బిజేపి  రాష్టాన్ని పట్టించుకోలేదు. కానీ మనం ప్రక్షాన  నిలిచామన్నారు. బంద్ లో పాల్గొని ప్రశాంత నిరసన ప్రదర్శన లు చేయాలి. ఎంపీల పోరాటానికి మద్దతుగా నిరసన ప్రదర్శన లు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మన పోరాటం జాతీయ స్థాయి లో వెళ్ళాలి. నిరసన లలో ఎక్కడ అశాంతి కి తావివ్వకండని అయన అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17243
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author