ఇండియాలో 727 టన్నుల బంగారం సేల్స్

ఇండియాలో 727 టన్నుల బంగారం సేల్స్
February 08 13:22 2018
ముంబై
బంగారంపై ఉన్న మోజు అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే 2017లో భారత్ బంగారం డిమాండ్ ఏకంగా 9.1 శాతం పెరిగిందట. ధరలు తగ్గడం, సానుకూల ఆర్థిక పరిణామాలు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విశ్వాసాలు, ధన్‌తేరస్ వంటి కారణాలవల్ల గడచిన ఏడాది బంగారానికి డిమాండ్ బాగా పెరిగింది. 2017లో భారతదేశం బంగారం డిమాండ్ 727 టన్నులుగా నిలిచిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఓ నివేదికలో పేర్కొంది. 2016లో ఈ డిమాండ్ 666.1 టన్నులుండగా గత ఏడాది 61 టన్నుల మేర పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ బంగారం గిరాకీ సరళిపై విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. ఆభరణాల కొనుగోళ్లు పెరగడంవల్ల డిమాండ్ పెరిగిందని తెలిపింది.జీఎస్‌టీ సంస్కరణలు గాడిలోపడటం, స్టాక్‌మార్కెట్లు దూసుకుపోవడం, గ్రామీణ ప్రాంతాలలో వినియోగదారుల జోరు వల్ల ఇది సాధ్యమైందని డబ్ల్యుజీసీ ఎమ్‌డీ  పీఆర్ సోమసుందరం పేర్కొన్నారు. వడ్డీవ్యాపారాలకు సంబంధించిన చట్టాల్లో సవరణలు కూడా గిరాకీ పెరగడానికి కారణమని చెప్పారు. ఆభరణాల మార్కెట్ డిమాండ్ 2016లో 504.5 టన్నులు ఉంటే 2017లో 12 శాతం మేరకు అంటే 562.7 టన్నులకు డిమాండ్ పెరిగింది. అయితే బంగారాన్ని పెట్టుబడిగా పెట్టే విషయంలో మాత్రం ప్రజలు వెనుకడుగు వేశారు. 2016తో పోలిస్తే పెట్టుబడులు 2 శాతం మేరకు 2017లో తగ్గిపోయాయి. వచ్చే రెండేళ్లలో బంగారు నాణాల డిమాండ్ అత్యంత వేగంగా పెరుగుతుందని ఆయన అంచనావేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బంగారం డిమాండ్ 700-800 టన్నుల మధ్య స్థిరంగా ఉండొచ్చని ఆయన అన్నారు. బంగారం దిగుమతి బాగా పెరిగిందని, 2016లో 558 టన్నులు దిగుమతి చేసుకుంటే, 2017లో 59 శాతం మేరకు, అంటే 888 టన్నులు దిగుమతి చేసుకున్నామని ఆయన చెప్పారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17293
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author