ఒక అడుగు ముందుకు..ఏడడుగులు వెనక్కు

ఒక అడుగు ముందుకు..ఏడడుగులు వెనక్కు
February 08 16:49 2018
మచిలీపట్నం
మచిలీపట్నం ఓడరేవు పరిస్థితి ఒక అడుగు ముందుకు..ఏడడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టు నవయుగా సంస్థకు అప్పగించారు. అప్పట్లో టీడీపీ దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఆందోళనలు కూడా చేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు కావస్తున్నా..పరిస్థితిలో ఏ మాత్రం మార్పులేదు. నవయుగా సంస్థ ఈ ఓడరేవు ప్రాజెక్టును దక్కించుకున్నా భూ కేటాయింపులు పూర్తి చేయకపోవటంతో పనులు ఏమీ మొదలు కావటంలేదు. ఓడరేవుకు అవసరమైన భూమితోపాటు పారిశ్రామిక కారిడార్ కు భారీ ఎత్తున భూ సేకరణ పూర్తి చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రైతులు ల్యాండ్ పూలింగ్ కు ససేమిరా అంటుండటంతో ఈ ప్రక్రియ ఎక్కడిది అక్కడే నిలిచిపోయింది. రాజధానిలో మాత్రం ల్యాండ్ పూలింగ్ కింద 33 వేల ఎకరాలు సేకరించిన సర్కారు ఇక్కడ మాత్రం ఫెయిల్ అయింది.రాజధానితో పోలిస్తే భూ యాజమానులకు ఇక్కడ ఇఛ్చే ప్యాకేజీ ఏ మాత్రం ఆకర్షణీయంగా లేకపోవటంతో రైతులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పారిశ్రామికవాడ సంగతి అటుంచి ఓడరేవు కూడా ఆగిపోయిన పరిస్థితి. మచిలీపట్నంలో కార్గో అంత లాభదాయంగా ఉండదని..పారిశ్రామికవాడను లింక్ చేస్తే తప్ప..ఇది ఉపయోగపడదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే రైతులు భూ సమీకరణకు నో చెప్పటంతో ఇప్పట్లో ఈ ప్రాజెక్టు ముందుకు కదిలే అవకాశాలు లేవని చెబుతున్నారు. జూన్..జూలై నెలాఖరు నాటికి కానీ కంపెనీ భూ సేకరణకు అయ్యే నిధులు సమీకరించుకోవాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17300
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author