సంగారెడ్డి లోనాలుగో వెల్ నెస్ సెంట‌ర్

సంగారెడ్డి లోనాలుగో వెల్ నెస్ సెంట‌ర్
February 08 16:51 2018
సంగారెడ్డి
ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు, జ‌ర్న‌లిస్టుల కుటుంబాల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు తెలంగాణ ప్ర‌భుత్వం దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన నాలుగో వెల్ నెస్ సెంట‌ర్ను  గురువారం సంగారెడ్డిలో ప్రారంభమైంది. ఈ వెల్ నెస్ సెంట‌ర్‌ని భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్‌రావుతో క‌లిసి వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి ప్రారంభించారు.ఇప్ప‌టి వ‌ర‌కు మూడు వెల్ నెస్ సెంట‌ర్లు రాష్ట్రంలో ప‌ని చేస్తున్నాయి. డిసెంబ‌ర్ 17, 2016న 0 ఖైర‌తాబాద్ వెల్ నెస్ సెంట‌ర్ ప్రారంభ‌మైంది. ఈ సెంట‌ర్ లో జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు 2,09,483 మంది ఓపీ చూశారు. ఫిబ్ర‌వ‌రి 2, 2017న వ‌న‌స్థ‌లి పురం వెల్‌నెస్ కేంద్రం ప్రారంభమైంది. ఈ సెంట‌ర్‌లో 1,19,950 మంది చికిత్స‌లు చేయించుకున్నారు. అలాగే  న‌వంబ‌ర్ 29, 2017న వ‌రంగ‌ల్ వెల్ నెస్ కేంద్రం ప్రారంభ‌మైంది.  వ‌రంగ‌ల్ వెల్ నెస్ కేంద్రంలో 17,892 మంది చికిత్స చేయించుకున్నారు. కాగా నాలుగో కేంద్రంగా సంగా రెడ్డిలో ప్రారంభం కానుంది. ఈ కేంద్రం ద్వారా పూర్వ‌ మెద‌క్ జిల్లాలోని దాదాపు 50వేల ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు, జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు వైద్య సేవ‌లు అంద‌నున్నాయి.ప్ర‌స్తుతం వెల్ నెస్ కేంద్రాల ద్వారా అన్ని ర‌కాల వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. అల్ట్రా సౌండ్‌, థైరాయిడ్‌, లిపిడ్ ప్రొఫైల్ వంటి ప‌రీక్ష‌లు కూడా జ‌రుగుతున్నాయి. అలాగే ప్రిష్కిప్ష‌న్ ద్వారా అవ‌స‌ర‌మైన మందుల‌ను ఉచితంగా అందిస్తున్నారు. బేసిక్ మందుల నుంచి క్యాన్స‌ర్ వంటి వ్యాధుల వ‌ర‌కు మందులు అందుతున్నాయి. అయితే, ఓపీకి మించిన వైద్య అవ‌స‌రాలున్న‌వాళ్ళను వివిధ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ వైద్య‌శాల‌ల‌కు రెఫ‌ర్ చేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17303
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author