ప్రకాశంలో విపక్షాల బంద్ సంపూర్ణం 

ప్రకాశంలో విపక్షాల బంద్ సంపూర్ణం 
February 08 17:40 2018
ఒంగోలు,
కేంద్ర బడ్జట్ లో రాష్ర్టానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాలు చేపట్టిన బంద్ ప్రకాశం జిల్లాలో కొనసాగింది. గురువారం తెల్లవారు జాము నుంచే విపక్షాలు ఆందోళనలు చేపట్టిన పార్టీలు బస్సులతో పాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నాయి. బంద్ సందర్భంగా షాపులు, కాంప్లెక్స్ లు, విద్యా సంస్ధలు స్వచ్చందంగా మూసివేసారు. రవాణా వ్యవస్ధ ఎక్కడికక్కడ స్ధంబించింది. తెల్లవారు జాము నుంచే అందోళనకారులు బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. షాపులను యజమానులు స్వచ్చందంగా మూసివేసి తమ మద్దతు తెలియజేశారు. విద్యా సంస్ధలు సెలవులు ప్రకటించాయి. జిల్లాలోని చీరాల, కనిగిరి, అద్దంకి, దర్శి, కందుకూరు, చీమకుర్తి, యర్రగొండపాలెంలో బంద్ జరిగింది. బైక్ ర్యాలీలు, మానవహరాలు, ఆందోళనలు చేపట్టిన వామపక్ష, వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులు నినాదాలు చేసారు. కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాల  తీరుకు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. ఒంగోలులో వామపక్ష పార్టీలు భారీ ఆందోళన చేపట్టగా, వైఎస్ఆర్సీపి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో  వైఎస్ఆర్ సిపి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వ తీరుపై వామపక్ష పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వలాభాల కోసం రాష్ర్టాన్ని కేంద్రానికి తాకట్టుపెట్టిన చంద్రబాబు ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్నాడని మండిపడ్డారు.  రాష్ర్టంలోని ప్రజలందరూ కేంద్రం తీరుపై మండి పడుతుంటే చంద్రబాబు మాత్రం వేచి చూసే ధోరణితో ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ సిపి పోరాటం చేస్తుందని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17328
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author