సుజనా చౌదరీపై విజయసాయి రెడ్డి పాయంట్

సుజనా చౌదరీపై విజయసాయి రెడ్డి పాయంట్
February 08 18:12 2018
న్యూఢిల్లీ,
కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడారంటూ రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను లేవనెత్తారు. కేబినెట్ లో కేంద్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపిన సుజనా  తరువాత సభలో దానితో విభేదించడం రాజ్యాంగ విరుద్ధమని రాజ్యసభలో మాట్లాడుతూ ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కేబినెట్ నిర్ణయంతో విభేదించవచ్చని అన్నారు. మంత్రిగా కొనసాగుతూనే కేబినెట్ నిర్ణయంతో ఎలా విభేదిస్తారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్కు విభజన హామీల అమలు అంశంపై రాజ్యసభలోనూ గురువారం ఆందోళన కొనసాగింది. ఏపీకి చెందిన ఎంపీలు తమ నిరసన గళాన్ని సభకు తెలియజేస్తున్నారు. విభజన హామీలు నెరవేర్చాలని కాకుండా, కేవలం రెండు గంటలు చర్చకు అవకాశం ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి  సభలో కోరారు. ఒకవేళ 15 రోజుల్లో ఆర్థిక మంత్రి స్పందించాలని లేకుంటే వచ్చే సమావేశాల్లో అయినా చర్చకు అవకాశం ఇవ్వాలన్నారు. కాగా ఓ వైపు సభ జరుగుతుంటే మరోవైపు సుజనా చౌదరి అమిత్ షాతో మంతనాలు జరిపారు.
మరో వైపు కేబినెట్లో బడ్జెట్కు ఆమోదం తెలిపిన తరువాత కేంద్రమంత్రి సుజనా చౌదరి విరుద్ధంగా మాట్లాడటం సరైంది కాదని, ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. కేబినెట్లో బడ్జెట్లో అభ్యంతరం తెలుపకుండా ఇప్పుడు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.విభజన హామీల అమలుపై 15రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలని కేంద్రమంత్రి సుజనాచౌదరి డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం, అమరావతి నిధులపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ ప్రజల మనోభావాలను కేంద్రం అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సూచించారు. ఈ సభ చేసిన హామీలను అమలు చేయట్లేదన్నారు. హామీలు అమలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత సభకు ఉందన్నారు.
కేంద్ర మంత్రివర్గంలో ఉన్న సుజనాచౌదరి రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎలా వ్యతిరేకిస్తారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. మంత్రివర్గంలో ఉండి ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మంత్రివర్గంలో ఉన్నవారు అడ్డుకోకుండా పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకురావాలన్నారు. సభ్యులు సభ సజావుగా సాగేలా సహకరించాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కోరారు. ఆయా అంశాలపై సూచనలు స్వీకరించేందుకు సభ సిద్ధంగా ఉందన్నారు. మంత్రివర్గంలో ఉన్నా సమస్య పరిష్కారానికి సలహాలు ఇవ్వొచ్చని సూచించారు.మరో వైపు  ఒక మంత్రి మరొక మంత్రికి సలహా ఇవ్వడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే అని చెప్పారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న చర్యను ఛైర్మన్ ఎలా విజయసాయి రెడ్డి  ప్రశ్నించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17335
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author