విజయసాయి రెడ్డి ఖబడ్దార్ : నర్సింహం

విజయసాయి రెడ్డి ఖబడ్దార్ : నర్సింహం
February 08 18:36 2018
న్యూఢిల్లీ,
రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై ఎంపీ తోట నరసింహం నిప్పులు చెరిగారు. ఖబడ్దారంటూ హెచ్చరించారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడతావా అని నిలదీసారు. నీ వ్యవహారాన్ని ఎంత వరకు తీసుకెళ్లాలో అంత వరకు తీసుకెళ్తామని హెచ్చరించారు. విజయసాయి రెడ్డి వ్యవహార శైలిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడితే సహించలేకపోతున్నారని అన్నారు. స్వాగతించాల్సిన సమయంలో వ్యతిరేకంగా మాట్లాడ్డం.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాననడం.. రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా పక్క దారి పట్టించే కుట్ర కన్పిస్తోందని ఆరోపించారు. మంత్రి పదవుల కోసం కేంద్రంతో టీడీపీ ఉందని భావిస్తే ఇంతకంటే అఙానం ఉండదు. విభజన సమయంలో.. అంతకు ముందు తెలంగాణ, ఏపీలకు చెందిన ఎంత మంది కేంద్ర మంత్రులు నాటి కేంద్ర వైఖరిని తప్పు పట్టలేదని అన్నారు. విజయసాయి రెడ్డి సంస్కారం ఇదేనా..? రాజకీయాలను పక్కన పెట్టి బంద్ సక్సెస్ అయ్యేలా మేం సహకరిస్తే.. నువ్వు రాజ్యసభలో ఇష్టానుసారం మాట్లాడుతున్నావా అని అడిగారు. పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా మారింది వైసీపీ వ్యవహరం. విషపు ఆలోచనలు.. కుళ్లుతో కూడిన కుట్రలు మానుకో.. లేకుంటే పుట్టగతులుండవని అన్నారు. విజయసాయి తీరుపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.  కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతోన్న సందర్భంలో విజయసాయి రెడ్డి మొత్తం వ్యవహారాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని తోట నర్సింహం అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17341
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author