నెల్లూరులో మేయర్ వర్సెస్ కార్పొరేటర్లు

నెల్లూరులో మేయర్ వర్సెస్ కార్పొరేటర్లు
February 09 14:15 2018
నెల్లూరుసిటీ,
నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉన్న నిప్పో భూ మార్పిడి విషయంలో మేయర్‌కు, అధికార పార్టీ కార్పొరేటర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒక దశలో మేయర్ అబ్దుల్ అజీజ్ సహనం కోల్పోయి కార్పొరేటర్లపై విచారణ చేయిస్తానంటూ ఒక కార్పొరేటర్‌ను కొట్టేందుకు వెళ్లగా కార్పొరేటర్లంతా ఏకమై మేయర్‌పై తిరగబడ్డారు. ఈక్రమంలో వివాదం ముదిరిపోవడంతో టీడీపీ అధిష్ఠానం దూతగా చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డిని పంపి వివాదాన్ని సద్దుమణిగేలా చూశారు. నిప్పో భూ మార్పిడి విషయంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు, ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఒక కీలక నేతకు భారీస్థాయిలో ముడుపులు ముట్టజెప్పడంతో అప్పటి నుంచి అసలు కథ మొదలైంది. అధికార పార్టీలో ఉన్న కార్పొరేటర్లు తమకు తెలియకుండా మేయర్ ఒక్కరే భారీస్థాయిలో ముడుపులు తీసుకున్నారని ప్రత్యక్షంగా మాటల దాడికి దిగడంతో దీనిపై తీవ్రస్థాయిలో దూమరం చెలరేగింది. దీంతో మంత్రి నారాయణ జోక్యం చేసుకుని ఈ అంశాన్ని కౌన్సిల్‌లో అజెండా నుంచి తొలగించాలని సూచించారు. అయితే మేయర్ మాత్రం మంత్రి నారాయణ మాటలను పెడచెవిన పెట్టి ఆకర్ష కార్పొరేటర్ల పేరుతో కౌన్సిల్లో ఈ అంశం మాట్లాడకుండా ఉండాలంటే అజీజ్ భాయ్ ట్రస్ట్‌కు రావాలని అధికార పార్టీ కార్పొరేటర్లకు మేయర్ పిఎ షంషుద్దీన్ నుండి ఫోన్ వచ్చినట్లు తెలిసింది. అయితే మేయర్ ప్రకటించిన ఆకర్ష పథకానికి 13 మంది కార్పొరేటర్లు మాత్రమే లొంగిపోయి ఒక్కొక్కరు 1.50 లక్షల రూపాయలు తీసుకెళ్లినట్లు సమాచారం. మిగతావారు మాత్రమే ఆకర్ష పథకానికి లొంగకుండా నిప్పో భూ మార్పిడిని కౌన్సిల్లో అడ్డుకున్నారు. దీంతో మేయర్ ఆకర్ష కింద ఇచ్చిన 1.50 లక్షల రూపాయలు వెనక్కి ఇవ్వాలంటూ కార్పొరేటర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఇదిలావుంటే నగరంలో చీమచిటుక్కుమన్నా నానారాద్ధాంతం చేసే వైసీపీ నాయకులకు కూడా నిప్పో భూమార్పిడిలో భారీస్థాయిలో ముడుపులు చేరినట్లు సమాచారం. ఏదిఏమైనా మేయర్ మాత్రం నిప్పో భూ మార్పిడి చేసేందుకు కౌన్సిల్ అనుమతి కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నించి విఫలమయ్యారు. త్వరలో జరగబోయే సమావేశంలో ఈ అంశాన్ని అజెండాలో చేర్చి అప్పటిలోపు కార్పొరేటర్లను దారికి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17373
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author