తెరపైకి మూడో ఫ్రంట్

తెరపైకి మూడో ఫ్రంట్
February 10 10:45 2018
విజయవాడ,
యూపీ.. గుజ‌రాత్‌లో ప‌వ‌ర్‌.. బీజేపీలో ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌ను పెంచింది. అదే స‌మ‌యంలో రాజ‌స్థాన్ దెబ్బ గ‌ట్టిగానే త‌గిలింది. క‌ర్ణాట‌కలో పాగా..
ఒడిషాపై ప‌ట్టు.. ఏపీ, తెలంగాణాల్లో అధికారం.. ఇదీ క‌మ‌లం గూటిలో మంత‌నాలు. అంతా అనుకున్న‌ట్లుగా జ‌రుగుతుంద‌ని భావించారు. పైగా చంద్రులిద్ద‌రూ.. మోదీ దాసుల‌నే భావ‌న‌లో  బీజేపీ అతిగా ఆశ‌ప‌డింది. కానీ.. అదే స‌మ‌యంలో బ‌డ్జెట్ కూడా త‌న ఇష్టారాజ్యంగా చేసినా.. ఎవ‌రూ నోరెత్త‌ర‌న‌కున్నారు. ఏపీ నేత‌లు స్వ‌రం పెంచారు. చంద్ర‌బాబునాయుడు మిత్ర‌ధ‌ర్మం పాటిస్తున్నామంటూనే.. ప్ర‌త్యేక‌హోదా కోసం ర‌గ‌డ‌కే జై కొట్టారు. ఊహించిన విధంగా.. చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోవ‌టంతో విప‌క్షాలు కూడా గొంతు పెంచాల్సి వ‌చ్చింది. ఫ‌లితంగా.. ఈ ప్ర‌భావం.. మిగిలిన రాష్ట్ర ప్రాంతీయ పార్టీల‌పై కూడా ప‌డ‌టం మోదీను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసిన‌ట్ల‌యింది. ఇలా జ‌రుగుతుంద‌ని భావించ‌ని బీజేపీ నేత‌లు.. దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు సిద్ధ‌ప‌డుతున్నారు. దీనంతటికీ.. ప్ర‌ధాన కార‌ణం.. ఏపీపై ప్రేమ‌.. తెల‌గాణ‌పై మమ‌కారం అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే.. ఎన్‌డీఏలో మొద‌లైన  లుక‌లుక‌లు.. యూపీఏను బ‌లోపేతం చేస్తాయి. మ‌రోవైపు.. మ‌రో థ‌ర్డ్‌ఫ్రంట్‌కు ఆజ్యం పోసిన‌ట్ల‌వుతాయ‌నే భ‌యం ప‌ట్టుకుంది. గ‌తంలో వాజ్‌పేయి చ‌విచూసిన అనుభ‌వం.. మున్ముందు ప‌రిస్థితుల‌కు దారితీయ‌వ‌చ్చ‌నే ముందుచూపుతోనే.. మోదీ రివ‌ర్స్‌స్వింగ్‌కు దిగారు. గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌.. ప్ర‌త్య‌క్షంగా మోదీను ల‌క్ష్యంగా చేసుకుని చేసిన కామెంట్స్‌.. కాక‌రేకెత్తించ‌గా.. తాజాగా కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి కూడా.. ఇన్నాళ్ల‌కు.. అస‌లైన ఏపీ నేత‌గా.. స్పందించి.. జైట్లీకు ఎదురుతిరిగారు. ఎక్క‌డా త‌గ్గేదిలేదంటూ.. తెగేసి చెప్పారు. ఇన్ని ప‌రిణామాలు.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్దామంటూ.. జ‌మిలీతో ఎన్నిక‌ల ర‌థాన్ని సిద్ధం చేసుకుంటున్న క‌మ‌ల‌నాథుల‌కు.. ఇవ‌న్నీ గొంతులో ఒక్క‌టి కాదు.. ఏకంగా వంద వెల‌క్కాయ‌లు ప‌డిన‌ట్లుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి…
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17393
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author