భారీగా పెరిగిన యూరియా ధరలు

భారీగా పెరిగిన యూరియా ధరలు
February 10 15:04 2018
నిజామాబాద్,
సాగులో విరివిగా వినియోగించే యూరియా, డీఏపీ ధరలను అమాంతం పెంచింది. 50 కిలోల యూరియా బస్తాకు రూ.112, డీఏపీకి రూ.132 చొప్పున పెంచారు. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. పెరిగిన ధరలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా జిల్లావ్యాప్తంగా వానాకాలంలో యూరియా, డీఏపీ కలిపి 53 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయి. యాసంగిలో సుమారు 41 వేల మెట్రిక్ టన్నులు వినియోగిస్తారు. అంటే రెండు సీజన్లలో కలిపి 94 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరముండగా.. పెరిగిన ధరలతో జిల్లా రైతాంగంపై రూ.9.5 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగు పనిలో నిమగ్న మవ్వడంతోపాటు జోరుగా ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. అయితే పాత స్టాక్ ఎరువులను కొందరు వ్యాపారులు కొత్త ధరలకు విక్రయిస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. పాత స్టాక్‌ను కొత్త ధరలకు విక్రయించొద్దని ప్రభుత్వం స్పష్టం చేసినా వ్యాపారులు పెడచెవిన పెడుతుండడంతో అన్నదాతలు భారీగా నష్టపోతున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయమందించేందుకు రాష్ట్ర సర్కారు సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. అర్హులైన రైతులకు చెక్కుల రూపంలో సాయం అందజేయనున్నారు. అన్నదాతలపై కేంద్రం ఎరువుల ధరల పెంపు ద్వారా పిడుగు వేసింది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల పేరిట ఎరువుల ధరలను అమాంతం పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 1వ తేదీ నుంచే పెరిగిన ధరలు అమలులోకి రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అడుగుమందులుగా పిలిచే కాంప్లెక్స్ ఎరువులైన 20-20,17-17-17, డీఏపీ తదితర కాంప్లెక్స్ ఎరువుల ధరల పెంపుతో జిల్లాలోని రైతాంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఒకవైపు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్‌ను అందజేస్తునే రానున్న వానాకాలం సీజన్ నుంచి రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.4వేలు ఒక పంటకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం అదునుచూసి దెబ్బ కొట్టినట్లుగా రైతులపై ఎరువుల భారాన్ని మోపుతున్నది. దీంతో రైతులు ఎరువుల ధరలపై ఆందోళన చెందుతున్నారు.  ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన మెదక్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో ప్రజలు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా జీవిస్తున్నారు. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో వర్షాకాలం, యాసంగి సీజన్‌లలో వరిపంటనే అత్యధిక మంది రైతులు సాగు చేస్తున్నారు. వానాకాలంలో సుమారు 1.59 లక్షల హెక్టార్లలో , యాసంగిలో 1.20 లక్షల హెక్టార్లలలో వివిధ రకాల పంటలను జిల్లాలోని రైతులు సాగు చేస్తారు. అధికారుల అంచనాల ప్రకారం వానాకాలంలో సాగు చేసే పంటలకు యూరియా, కాంప్లెక్స్, పొటాషియం ఎరువులు కలిపి సుమారు 53 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయి. యాసంగిలో 41వేల టన్నుల ఎరువులు అవసరం. కాంప్లెక్ ఎరువులైన డీఏపీ బస్తా ధర ప్రస్తుతం రూ.1,081/-, 20-20 కాంప్లెక్స్ ఎరువు ధర రూ.872/- ఉంది. కంపెనీల తాజా నిర్ణయంతో డీఏపీ బస్తా ధర ఇకనుంచి రూ.132/-, కాంప్లెక్స్ బస్తా ధర రూ.112/- పెరుగనుంది. జిల్లాలో వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి 18,000వేల మెట్రిక్ టన్నుల డీఏపీ వినియోగిస్తారు. టన్ను డీఏపీ పై రూ.2,640 పెరుగడం వల్ల జిల్లాలోని రైతులపై రూ.4.75 కోట్ల భారం పడనున్నది. అలాగే రెండు సీజన్లలో 21,000 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తారు. టన్ను కాంప్లెక్స్ ఎరువు ధరపై రూ.2,240 పెంచడం వల్ల రైతులపై మరో 4.75 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడనుంది. పెరిగిన ధరలతో డీఏపీ బస్తా రూ.1215కు, కాంప్లెక్స్ ఎరువుల బస్తా రూ. 984కు చేరనున్నది. దీంతో యేడాదికి జిల్లా రైతుల పై వానాకాలం, యాసంగి రెండు సీజన్‌లకు కలిపి రూ.9.5కోట్ల రూపాయల వరకు భారం పడనుండటం గమనార్హం. ఇది జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంది అనడంలో సందేహాం లేదు. ఒక పక్క ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం వినూత్న పథకాలను అమలు చేస్తుంటే … కేంద్రం మాత్రం అడ్డగోలుగా ధరలను పెంచడంపై అన్నధాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17416
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author