మెరుగుపడిన వన్యప్రాణి సంపద

మెరుగుపడిన వన్యప్రాణి సంపద
February 10 15:44 2018
ఆదిలాబాద్,
 ఇటీవల దేశవ్యాప్తంగా జంతుగణను ప్రభుత్వం నిర్వహించింది. తెలుగురాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగణంగా చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల జనాభాను  గణించి రికార్డుల్లో నమోదుచేశారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్‌ జిల్లాలోని జంతు సంపద గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. స్థానిక అడవుల్లో వన్యప్రాణులు భారీగానే ఉన్నట్లు తేలింది. అడవుల నరికివేత, వేటగాళ్ల వల్ల గతంలో అనేక జంతువులు కనుమరుగయ్యాయి. అయితే ప్రభుత్వం ఈ అక్రమాలపై ఉక్కుపాదం మోపడంతో పరిస్థితి మెరుగుపడింది. అటవీశాఖ కట్టదిట్టమైన రక్షణ కల్పిస్తుండటంతో ఇంకా అనేక జంతువులు అడవుల్లో మనుగడ సాగిస్తున్నట్లు తేలింది. ఇందులో మాంసాహార జీవుల కంటే శాకాహార జీవులే అధికంగా ఉన్నట్లు గణన ద్వారా తెలిసింది. అయితే మాంసాహార జంతువుల్లో పులులు లేనట్లు తెలుస్తోంది. కానీ చిరుతపులుల జాడ మాత్రం సిబ్బంది గుర్తించారు. జిల్లాలోని అన్ని అటవీ బీట్‌లలోనూ చిరుతల సంచారం ఉన్నట్లు కనుగొన్నారు. వీటితో పాటు ఎలుగుబంట్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నట్లు తేలింది.
జంతుగణనను రెండు విడతలుగా చేపట్టారు. తొలివిడత జనవరి 22 నుంచి మూడు రోజుల పాటు మాంసాహార జంతువుల వివరాలను తెలుసుకున్నారు. 27వ తేదీ నుంచి శాకాహార జీవుల వివరాలను కనుగొన్నారు. అటవీశాఖ అధికారులతో పాటు స్థానికుల సహకారంతోనూ లెక్కింపు నిర్వహించారు. అడవుల్లో ప్రత్యక్షంగా చూడటంతో పాటు వాటి  పాదముద్రల ఆధారంగా, వాటి విసర్జితాలు, చెట్లపై గీరలు, వాటి నివాసాలుగా భావించే బొరియలు, జంతువుల కళేబరాలతో పాటు వాటి అరుపులు విని అవి ఏ జంతువులో గుర్తించి నమోదు చేసుకున్నారు. వీటితో పాటు స్థానిక అడవుల్లోకి నిత్యం వెళ్లే పశువుల కాపరులు, స్థానిక ప్రజల నుంచి సమాచారం సేకరించి జంతువుల వివరాలు లెక్కగట్టారు. మాంసాహార జంతువుల్లో నక్కలు, తోడేల్లు అధికంగా ఉన్నాయి. వీటి తర్వాతి స్థానాల్లో అడవి పిల్లులు, ఎలుగుబంట్లు ఉన్నాయి. ఆదిలాబాద్‌, ఉట్నూర్‌ అటవీ డివిజన్ల పరిధిలో చిరుతలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. జంతు గణనకు ముందు ఈ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతం నుంచి జిల్లాలోని తాంసి, బేల మండలంలోని పలు గ్రామాల్లో కొద్దిరోజులుగా పులి సంచరింది. ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యక్షంగా వీటిని చూశారు. అధికారులు కూడా పులి సంచరించిట్లు వాటి అడుగుల ఆధారంగా నిర్ధారించారు. కానీ తాజాగా నిర్వహించిన గణనలో దాని జాడ కనిపించలేదు. అప్పట్లోనే బేల మండలం నుంచి గాదిగూడ అడవుల వైపు తరలి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో శాకాహార జంతువులే అధికంగా ఉన్నట్లు తేలింది. ఇందులో ఎక్కువగా అడవిపందులు ఉండగా తర్వాతి స్థానంలో మనుబోతులు, కుందేళ్లు, చుక్కల దుప్పిలు, కొండగొర్రెలు కనుజులు, కృష్ణజింకలు ఉన్నట్లు గణనలో తేలింది. ఏదేమైనా జిల్లాలో వన్యప్రాణి సంపద పెరగడంపై స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17435
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author