తెలంగాణ పర్యటక రంగ ప్రచారం మహిళల యాత్ర

తెలంగాణ పర్యటక రంగ ప్రచారం మహిళల యాత్ర
February 10 16:28 2018
హైదరాబాద్,
తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి నలుగురు తెలంగాణ ఆడబిడ్డలు మోటారు బైకులపై సాహసయాత్ర చేయడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి ఆజ్మీర చందూలాల్ తెలిపారు.
శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఈ నెల 11 న ఉదయం 7 గంటలకు పర్యాటక భవనం నుండి సాహసయాత్ర ప్రారంభించడం జరుగుచున్నదన్నారు. ఈ నలుగురు మహిళలు మోటారు బైక్ లపై  7 దేశాలను రోడ్డు మార్గం ద్వారా సాహస యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సాహస యాత్ర కొనసాగే ప్రాంతాలలో మనదేశంలోపాటు  తెలంగాణ పర్యాటక రంగ విశేషాలను ప్రచారం చేస్తూ, సుమారు 17 వేల కిలోమీటర్లు భారతదేశంలోని  వివిద రాష్ట్రాలతో పాటు తూర్పు ఆసియా దేశాలలో ప్రయాణించనున్నారు. ఈ బైక్ సాహస యాత్రలో జై భారతి నాయకత్వం వహిస్తారని, ఆమెతో పాటు ప్రియ, శాంతి, శిల్ప ఉంటారని మంత్రి తెలిపారు.  ఈ సాహస యాత్రలో భాగంగా వారు ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్ లాండ్, లావోస్ కంబోడియా, వియత్నాం దేశాలలో పర్యటించి తెలంగాణ పర్యాటకరంగాన్ని చాటి చెప్పడం జరుగుతుందన్నారు. ఈ యాత్ర నిర్వహిస్తున్న సమయంలో వీరు 19 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు, 35 యునెస్కో సైట్లను సందర్శిస్తారన్నారు.పర్యాటక,సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లడుతూ నలుగురు మహిళలు 50 రోజులలో 7 దేశాలలో దాదాపు 17వేల కిలోమీటర్లు పర్యటించి వస్తారన్నారు. వీరికి 400సిసి బైకులను బజాజ్ ఆటో కంపెనీ వారు స్పాంసర్  చేశారని తెలిపారు. మహిళలు సురక్షితంగా పర్యటనలు నిర్వహించడానికి ఈ యాత్ర దోహదపడుతుందన్నారు. వీరు పర్యటించే రాష్ట్రాలు, దేశాల అధికారులతో సంప్రదించి వీరికి అవసరమైన సౌకర్యాలు కల్పించే విధంగా రాష్ట్ర పర్యాటక శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రయాణ మార్గంలో గుర్తించిన ప్రాంతాలలో తెలంగాణ పర్యాటక శాఖకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తారన్నారు. తెలంగాణ పర్యాటకరంగాన్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకరావడమే ఈ యాత్ర ముఖ్యఉద్ధేశ్యమని ఆయన తెలిపారు.
 మోటార్ బైక్ సాహసయాత్ర బృందానికి నాయకత్వం వహించే జై భారతి మాట్లడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత షీటీం లను ఏర్పాటు చేసి మహిళలకు భరోసా కల్పించడం వలన అమ్మాయిలు రాష్ట్రంలో క్షేమంగా తిరగగలుగుతున్నారని, దీనిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఆడబిడ్డలు సాహసయాత్రలో పాల్గొనగలుగుతున్నారని తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17448
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author