ఈ రోడ్డులో ఎలా ప్రయాణించాలి

ఈ రోడ్డులో ఎలా ప్రయాణించాలి
February 12 14:35 2018
మహబూబ్ నగర్,
నాగర్ కర్నూలు జిల్లాలోని పెంట్లవెల్లి మండలంలోని ఎంగంపల్లి, మంచాలకట్ట, మాధవస్వామినగర్, కొండూరు తదితర గ్రామాల్లో ఇప్పటికీ సీసీరోడ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నారులు తిరిగేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి ఎక్కడెక్కడో పనులు చేస్తున్నారు.. కానీ గ్రామాల్లో సీసీరోడ్లు మాత్రం ఇప్పటికీ వేయడంలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రతికాలనీలో సీసీరోడ్లు వేయిస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు వేయలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. సీసీరోడ్లు నిర్మిస్తే ప్రయాణికులకు, గ్రామస్తులకు ఇబ్బందులు తొలగుతాయని, పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరితే మంజూరవుతాయి.. అప్పుడిప్పుడంటూ కాలయాపన చేస్తున్నారని.. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా.. రోడ్లు వేయలేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు బహిరంగ సభలలో ఎన్నో హామీలిస్తారు కానీ ఎక్కడో ఒకటి రెండు తప్ప మిగతా చోట్ల న్యాయం చేయడం లేదని విమర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిదులు, అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, కాలనీల్లో సీసీరోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17495
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author