బలిజలకు బిసి సర్టిఫికెట్ వచ్చేవరకు ఉద్యమం ఆగదు

బలిజలకు బిసి సర్టిఫికెట్ వచ్చేవరకు ఉద్యమం ఆగదు
February 12 14:48 2018
చిత్తూరు,
బలిజ కులాల వారిని చట్టబద్ధంగా చేర్చి, వారికి బిసి సర్టిఫికెట్ వచ్చేవరకు తను చేపట్టిన ఉద్యమం ఆగదని కాపునేత నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తిలో బలిజల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన కాపులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోయాక కీలకంగా మారిన కాపుల ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు కాపులను బిసి జాబితాలో చేరుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. తరువాత కమిషన్ వేసి కొద్దిరోజులు కాలయాపన చేసి, అనంతరం యువత ఉద్యమ కారణంగా అసెబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. పల్స్ సర్వే సరిగా జరగని కారణంగా 10 శాతం రావాల్సిన కాపు రిజర్వేషన్ 5 శాతం చేశారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించాలని, లేకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేరుతుందని హెచ్చరించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17498
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author