‘స్వచ్ఛ భారత్’లో హైదరాబాద్ రికార్డ్

‘స్వచ్ఛ భారత్’లో హైదరాబాద్ రికార్డ్
February 12 15:05 2018
హైదరాబాద్,
హైదరాబాద్  నగరంలోని రాంనగర్ డివిజన్లో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. 15,320  మంది విద్యార్థులు.. ఏకకాలంలో రోడ్లను ఊడ్చి గిన్నిస్ రికార్డు సాధించారు.  సోమవారం నాడు  రాంనగర్ డివిజన్ బాగ్ లింగంపల్లి అంబేడ్కర్ కాలేజ్  లో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి వేలాదిగా విద్యార్థులు తరలివచ్చారు. జీహెచ్ఎంసీ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్వచ్ఛత విషయంలో హైదరాబాద్ మహానగరాన్ని జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉంచుదామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. 2017 లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భారత్ వ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో హైదరాబాద్‌కు అగ్రస్థానం దక్కింది అని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాదికి సంబంధించి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తెలిపారు.  స్వచ్ఛ హైదరాబాద్ కింద నగరాన్ని 400 యూనిట్లుగా విభజించి.. జీహెచ్ఎంసీ సహకారంతో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లో కోటి జనాభా ఉంది. 22 వేల మంది పారిశుధ్ధ్య కార్మికులు నగరాన్ని క్లీన్ చేస్తే సరిపోదు. కాబట్టి నగరంలోని విద్యార్థులందరూ పరిశుభ్రత కోసం కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. తడి, పొడి చెత్త కోసం పంపిణీ చేసిన బుట్టలను వేరే అవసరాలకు ఉపయోగించకుండా.. చెత్త కోసమే ఉపయోగించాలన్నారు. మన ఇంటిలోనే తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ప్రతిజ్ఞ తీసుకోవాలని సూచించారు. అప్పుడు కచ్చితంగా హైదరాబాద్ నగరం పరిశుభ్రంగా మారుతుందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 సర్వేలో అందరం పాల్గొని.. హైదరాబాద్‌ను జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉంచేందుకు కృషి చేద్దామన్నారు.
ఇంతకుముందు గుజరాత్ వడోదరలో జరిగిన సామూహిక స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 5058 మంది పాల్గొని రెండు నిమిషాల పాటు రోడ్లను ఊడ్చి గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించారు. సోమవారం బాగ్ లింగంపల్లిలో జరిగిన కార్యక్రమానికి  రాంనగర్ డివిజన్లోని 26 పాఠశాలలకు చెందిన 8,500 మంది విద్యార్థులు, ఆరు కళాశాలలకు చెందిన 2 వేల మంది కళాశాల విద్యార్థులు, 600 మంది టీచర్లు, 800 మంది వాలంటీర్లతో పాటు మరో 3 వేల మంది వివిధ కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17504
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author