మహిళలకు భరోసగా ఆరోగ్య దీప్తి : కామినేని

మహిళలకు భరోసగా ఆరోగ్య దీప్తి :  కామినేని
February 12 15:13 2018
విజయవాడ,
మహిళల మాస్టర్ హెల్త్ చెకప్ పధకం క్రింద  వైద్యపరీక్షలు చేసేందుకు 1300 మంది నర్సులకు శిక్షణ ఇచ్చాం. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను ఎన్టీఆర్ వైద్యసేవ క్రిందకు తీసుకొచ్చామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం నాడు  గ్రామీణ మహిళలకు ఆరోగ్య భద్రతపై ఏర్పాటు చేసిన “ఆరోగ్య దీప్తి” అవగాహన సదస్సులో అయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీ కొనకల నారాయణ, స్వచ్ఛాంధ్ర ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డా.సి.ఎల్.వెంకట్రావు, జడ్పీ చైర్మన్ గద్దె అనురాధ తదితరులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ  20 వేల మంది మహిళలకు ఈ పధకం వల్ల లబ్ధి చేకూరుతుందని అన్నారు. విజయవాడ సిద్ధార్ధ మెడికల్ కళాశాలలో ఎయిమ్స్ అడ్మిషన్స్ జులైలో ప్రారంభమవుతాయని అన్నారు.  రక్తహీనత వల్ల తల్లి,బిడ్డల మరణాలు ఆధికంగా ఉన్నాయి. ఏ ఎన్నేమ్ , ఆశా వర్కర్ లకు 16 వేల ట్యాబ్స్ ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17509
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author