ఈసారి పార్లమెంట్ కు పోటీ : కోమటిరెడ్డి

ఈసారి పార్లమెంట్ కు పోటీ : కోమటిరెడ్డి
February 12 18:02 2018
నల్గొండ,
వచ్చే ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేసారు. సోమవారం నాడు నల్గొండ జిల్లా వేములపల్లి లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి తరువాత మీడయాతో మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజక వర్గాలను కైవసం చేసుకుంటామని అన్నారు. తెరాస ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్ళలా చూస్తుంది.  కాలుష్యాన్ని వెదజల్లే  థర్మల్ ప్లాంట్ దామరచర్లలోవద్దని మొత్తుకుంటున్నా కమిషన్ల కోసం ప్లాంట్ ను నిర్మించాలని  ప్రభుత్వం చూస్తుందని అయన విమర్శించారు. రెండు రూపాయలకు యూనిట్  కరెంట్ దొరుకుతుంటే 6 రూపాయలు ఖర్చయ్యే ప్లాంటును తీసుకరావడం హాస్యాస్పదంగా ఉందని అయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకేసారి రైతు రుణ మాఫీ చేస్తుందని అయన అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17523
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author