సెర్బియా ప్లేయర్ తో హరికృష్ణ పెళ్లి

సెర్బియా ప్లేయర్ తో హరికృష్ణ పెళ్లి
February 12 18:43 2018
గుంటూరు,
భారత గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ పెంటెల త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. సెర్బియాకు చెందిన చెస్ ప్లేయర్ నడ్జాను ప్రేమించి పెళ్లాడబోతున్నాడు. మార్చిన వీరి వివాహం హైదరాబాద్‌లో జరగనుంది. పెళ్లికి సంబంధించిన వీడియో, అమ్మాయి ఫొటోలను హరికృష్ణ మీడియాకు రిలీజ్ చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన హరికృష్ణ టాప్ చెస్ ప్లేయర్‌గా ఎదిగాడు. విశ్వనాథన్ ఆనంద్ స్ఫూర్తితో చదరంగంలోకి అడుగుపెట్టిన ఈ తెలుగు కుర్రాడు.. అతిపిన్న వయసులో గ్రాండ్ మాస్టర్‌గా హోదా సాధించిన భారతీయుడిగా రికార్డ్ నెలకొల్పాడు.హరికృష్ణ, నడ్జా చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. జూనియర్ స్థాయిలో టోర్నీల్లో పాల్గొనే సమయం నుంచే వీరి మధ్య పరిచయం ఉందట. మొదట స్నేహితులుగా మెలిగిన వీరు తర్వాత క్రమంగా ప్రేమికులుగా మారారట. ఇటీవలే వీరి పెళ్లి గురించి హరికృష్ణ తండ్రి నాగేశ్వర రావు మీడియాకు వెల్లడించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17536
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author