ఎపి ఫైబర్నెట్ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు 

ఎపి ఫైబర్నెట్ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు 
February 12 19:04 2018
అమరావతి,
రాష్ట్రంలో ఎపి ఫైబర్నెట్ ద్వారా ఇంటింటికీ 149 రూ.లకే టివి, ఇంటర్నెట్ సేవలు పూర్తి నాణ్యతతో అందించేలే అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు.ఎపిఫైబర్ నెట్ (భారత్ నెట్ ఫేజ్-2) అమలుపై భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్కు లిమిటెడ్ సిఎండి సంజయ్ సింగ్ తో కలిసి సోమవారం వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ఎంతమాత్రం రాజీ పడవద్దని స్పష్టం చేశారు.అలాగే రాష్ట్రంలో త్వరితగతిన పైబర్ నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్దేశిత గడువులోగా ఈప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఈప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా మూడు నాలుగు జిల్లాలకు ఒక ఏజెన్సీకు పనులు అప్పగించి నిర్దేశిత గడుపు ప్రకారం పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవలాని ఎపి ఫైబర్ నెట్ అధికారులను సిఎస్ ఆదేశించారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ సిఇఓ బాబు ఎ ఎపి ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ భారత్ నెట్ ఫేజ్-2కు సంబంధించి ఇది మొట్టమొదటి రాష్ట్రస్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశమని 861కోట్లతో చేపట్టిన ఆప్రాజెక్టును 2019 మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.ఈనెల 18వతేదీలోగా సర్వే ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు వివరించారు.
ఈ సమావేశంలో భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్కు లిమిటెడ్ సిఎండి సంజయ్ సింగ్, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్,ఆశాఖ కార్యదర్శి విజయానంద్,బిఎస్ఎన్ఎల్ సిజిఎం ఎపి రావు,బిఎస్ఎన్ఎల్ జియం రవీంద్రనాధ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17549
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author