జనగామ జిల్లాల్లో అక్రమ రేషన్….

జనగామ జిల్లాల్లో అక్రమ రేషన్….
February 13 09:49 2018
కరీంనగర్,
జనగామ జిల్లాలో రోజురోజుకు బియ్యం మాఫియా ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఈ దందాను కొనసాగిస్తున్నారు. దొరికితే దొంగ లేకుంటే దొర అన్న చందంగా వారి వ్యవహారం శృతి మించిపోతోంది. కొందరు అవినీతి అధికారుల కారణంగా వ్యాపారులు ఇష్టారాజ్యంగా బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన బియ్యం వేరే ప్రాంతానికి తరలిస్తుండగా అక్కడి పోలీసులు పట్టుకున్న తర్వాత కానీ ఇక్కడి అధికారులు మేల్కోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేగాకుండా వరుసగా నిందితులు పట్టుబడినప్పటికీ వారిపై పీడీ యాక్ట్ లాంటి శాశ్వత చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా దందాను నిలువరించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే బియ్యం వ్యాపారులకు స్థానిక అధికారులే పరోక్ష సహకారం ఉందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. జిల్లా సరిహద్దు ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకున్న కొందరు ముదురు వ్యాపారులు బియ్యం దందాను నడిపిస్తున్నారు. ఈ దందాలో రఘునాథపల్లి, పాలకుర్తి చెందిన వ్యాపారులది అందెవేసిన చేయిగా ప్రచారంలో ఉంది. కొంతమంది ఏజంట్లను నియమించుకుని టాటా ఏస్ వాహనాల ద్వారా గ్రామాల నుంచి రేషన్ బియ్యం సేకరించడం వీరి ప్రధాన విధి. అటు తర్వా త ఆ బియ్యాన్ని జిల్లా సరిహద్దులో ఏదో ఒకచోట (వ్యవసాయ క్షేత్రం) నిల్వ చేసి అదును చూసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా ఈ దందాను నడుపుతున్నా వారంతా ఇటు పౌరసరఫరాల అధికారులు, అటు పోలీసులకు సుపరిచితులేననే వాదనలున్నాయి. కానీ వారిపై సరైన నియంత్రణ లేకపోవడం వల్లే కొంతకాలంగా స్తబ్ధుగా ఉంటున్న అక్రమార్కులు అదును చూసి రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అధికార యం త్రాంగం బియ్యం మాఫియా ఆగడాలకు చెక్ పెట్టడంలో సఫలీకృతమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితులను పట్టుకుని కేసులు నమోదు చేశారు. వరుస నేరాలకు పాల్పడుతున్న నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు సైతం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. కానీ అవి ఎక్కడ కూడా కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా మళ్లీ చాపకింద నీరులా బియ్యం మాఫియా తన వ్యాపారాన్ని కొనసాగిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం బియ్యం మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా నిందితులపై సాదాసీదా కేసులు నమోదుతో స్టేషన్‌బెయిల్ తో సరిపెట్టడంతో అక్రమార్కులు ఎలాంటి బెదురు లేకుండా పోయిందనే ప్రచారం ఉంది. ఎక్కువ సంఖ్యలో నేరాలు చేసిన నిందితుల ను గుర్తించి వారిపై పీడీ యాక్ట్ లాంటి చర్యలు తీసుకుంటే గానీ మిగిలిన నిందితులకు గుణపాఠంగా ఉం టుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ కొం దరు అధికారులు ఆమ్యామ్యాలకు అలవా టు పడి సీరియస్ కేసులపై నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే అక్రమాలు పునరావృతం అవుతున్నాయనే ఆ రోపణలున్నాయి. అధికార యంత్రాంగం మాఫియాపై దృష్టి సారించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17560
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author