ఘ‌నంగా చెత్త విడాకుల‌దినోత్స‌వం

ఘ‌నంగా చెత్త విడాకుల‌దినోత్స‌వం
February 14 18:36 2018
 హైదరాబాద్
జీహెచ్ఎంసీ  ఆధ్వ‌ర్యంలో న‌గ‌రంలోని ప‌లు స‌ర్కిళ్ల‌లో చెత్త విడాకుల‌దినోత్స‌వాన్ని నేడు ఘ‌నంగా నిర్వ‌హించారు. స్వ‌చ్ఛ‌తకు, ప్రేమ‌కు అభినాభావ సంబంధం ఉన్నందున ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్స‌వంగా నిర్వ‌హిస్తున్న ఫిబ్ర‌వ‌రి 14న చెత్త విడాకుల దినోత్స‌వాన్ని నిర్వ‌హించాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో చెత్త‌ను త‌డి, పొడి చెత్త‌గా వేరు చేయాల‌ని చైత‌న్య ప‌రుస్తూ చెత్తను విడ‌దీస్తూ విడాకుల దినోత్స‌వాన్ని వినూత్నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ర్యాలీలు, మాన‌వ‌హారాలు, స‌మావేశాలు నిర్వ‌హించారు. చెత్త క‌లిసి ఉండ‌డం ద్వారా క‌లిగే దుష్ప‌రిమాణాలు, చెత్త‌ను త‌డి, పొడి చెత్త‌గా విడ‌దీయ‌డం ద్వారా కంపోస్ట్ ఎరువుల త‌యారీ, 75శాతం చెత్త‌ను తిరిగి ఉప‌యోగించ‌డం జ‌రుగుతుంద‌ని ఈ సంద‌ర్భంగా చైత‌న్య‌ప‌ర్చారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17628
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author