మళ్లీ మావోల అలజడి

మళ్లీ మావోల అలజడి
February 15 11:18 2018
విజయనగరం,
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోల అలజడి లేదని పోలీసులు కొట్టిపారేస్తున్నప్పటికీ, కేడర్ బలోపేతం చేసే దిశగా మావోలు అడుగులు వేస్తున్నట్లు బోగాట్టా. ఇటీవల కాలంలో మావోలకు గట్టి ఎదురుదెబ్బ తగలడంతో కీలకమైన నేతలు హతమైన విషయం విదితమే. అప్పటి నుంచి ఎఒబిలో ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడకుండా తిరిగి కేడర్‌ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల ఎఒబిలో డిప్యూటీ కమాండర్ అరుణ చైతన్య వర్మ ఆధ్వర్యంలో సమావేశమైనట్టు తెలిసింది. లక్ష్మినారాయణపురం దళానికి చెందిన మావోలు సమావేశమయ్యారు. మరోపక్క ఇతర ప్రాంతాల నుంచి యువతను ఇక్కడకు తీసుకువచ్చి వారికి శిక్షణనిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆంధ్రలోని సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాలతోపాటు ఒడిశాలోని పొత్తంగి బ్లాక్‌లో మావో సానుభూతిపరులు ఉన్న విషయం విధితమే. మరో ఆరు నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండడంతో వాటిని బహిష్కరించాలని ఉద్భోదిస్తున్నారు. ప్రస్తుతానికి ఎఒబిలో ఎలాంటి అలజడి లేనప్పటికీ మావోలు తరచు సమావేశమవుతున్నారన్న విషయాన్ని పోలీసులు అంగీకరిస్తున్నారు. చాపకింద నీరులా మావోలు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఎఒబిలో పదేపదే సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క కొత్త కేడర్ కోసం అటవీ ప్రాంతాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే పొత్తంగి బ్లాక్‌లోని బొల్లూరు, కేటూరు, నారింజపాడు, జామిగుడ, మూలవలస, నిమ్మలపాడుతోపాటు మక్కువ, పాచిపెంట, సాలూరు మండలాల్లో మావోల సానుభూతిపరులు ఉండటంతో దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందోనని ఆందోళన అందరిలో వ్యక్తమవుతోంది. మరోపక్క కొఠియా ప్రాంతంలో అధికారుల పర్యటనపై కూడా మావోలు ఆరా తీసినట్టు సమాచారం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17649
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author