రైతులకు భారంగా మారిన ఎరువుల ధరలు

రైతులకు భారంగా మారిన ఎరువుల ధరలు
February 15 11:26 2018
కడప,
కడప జిల్లాలో ఖరీఫ్‌, రబీ పంట కాలాల్లో 3.50 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ ఖరీఫ్‌లో 1.20 లక్షల హెక్టార్లు, రబీలో సుమారు 2 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా వేరుసెనగ, పొద్దు తిరుగుడు, వరి, శనగ లాంటి పంటలతో పాటు మరిన్ని రకాల పంటలు సాగవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 లక్షల మందికి పైగా రైతులు ఈ పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న నల్ల, ఎర్ర, తువ్వ, గరుగు నేలలు, కాలువలు, ప్రాజెక్టులు, బోరుబావుల కింద ఈ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. కొందరు రెండు కార్లు పంటలు పండిస్తే నీటి ఆధారం ఉన్నవారు మూడు కార్లు పంటలు తీస్తున్నారు.
పంటలకు పశువుల ఎరువు, వరి మడికి ఆకు, పశువుల ఎరువు, వర్షాధారం కింద సాగు చేసే వాటికి, నీటి ఆధారం కింద సాగు చేసే పంటలకు మట్టి, ఇసుక ఇలా సాధారణ ఎరువులనే సత్తువు కింద వినియోగించే వారు. కాలక్రమేనా రసాయన ఎరువుల వినియోగానికి రైతు అలవాటు పడ్డాడు. ఇప్పుడు దాని నుంచి బయట పడలేకున్నారు. రసాయన ఎరువులు చిలకరించందే విత్తు వేయలేని పరిస్థితికి రైతు వచ్చేశారు. అలవాటు పడిని అన్నదాత ఎరువుల వాడకాన్ని తగ్గించడం అంటుంచి ఏటా బస్తాలకు బస్తాలు పెంచుకుంటునే పోతున్నారు.జిల్లాలో సాగు చేస్తున్న విస్తీర్ణానికి ఏటా రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికలు పంపుతుంటుంది. అలా గత ఏడాది మనకు 1.60 లక్షల మెట్రిక్‌ టన్నులు వస్తే అందులో 1.40 లక్షల మెట్రిక్‌ టన్నులు వ్యాపారం జరిగింది. అంటే రైతులు అంత ఎరువులను కొనుగోలు చేసినట్లు అధికారిక లెక్కలు చూపుతున్నాయి. అదే ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 90 వేల మెట్రిక్‌ టన్నులు విక్రయం జరిగింది. ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి మరో 20 వేల టన్నులు వ్యాపారం జరుగుతుందని అధికారులంటున్నారు. అంతా కలిపి 1.10 లక్షల టన్నుల ఎరువులు వ్యాపారం జరుగుతుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.నిరుడు జిల్లాకు వచ్చిన ఎరువులు 1.60 లక్షల మెట్రిక్‌ టన్నులు. అందులో 1.40 లక్షలే వ్యాపారం జరిగింది. అదే ఈ ఏడాది రమారమి ఏటా 1.10 లక్షల టన్నుల ఎరువులను రైతులు కొనుగోలు చేసి వినియోగించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికి 90 వేల టన్నులు వ్యాపారం జరిగితే ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి మరో 20 వేల టన్నులు వ్యాపారం జరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. 1.10 లక్షల టన్నుల్లో 40 వేల టన్నులు యూరియా, 10 వేల టన్నులు ఎంఓపీ ఎరువులున్నాయి. ఈ రెండు ధరలు ధరలు పెరగలేదు. ఇక మిగిలిన 60 వేల టన్నులు కాంప్లెక్స్‌ ఎరువులే. ఇవన్ని అధరలు పెరిగాయి. ధరలు పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువులు 60 వేల టన్నులు.. టన్నుకు 20 బస్తాల ప్రకారం లెక్కిస్తే 12 లక్షల బస్తాలవుతాయి. కొన్ని రకాలు మినహా మిగిలిన ఎరువులు బస్తాపై రూ.134 రూపాయల వరకు ధర పెరిగింది. ఈ ధరను తక్కువ ఎక్కువలను బేరీజు వేసుకుని సరాసరి రూ.110తో పోల్చి 12 లక్షల బస్తాలను పెరిగిన ధర రూ.110తో లెక్కిస్తే రూ.13.20 కోట్లు అవుతుంది. ఇదంతా ఏటా జిల్లా అన్నదాత అదనంగా మోయాల్సిన భారం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17657
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author