సన్ రైజర్స్ షెడ్యూల్ ఇదే

సన్ రైజర్స్ షెడ్యూల్ ఇదే
February 15 12:05 2018
హైద్రాబాద్,
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐపీఎల్ పండగకు ముహూర్తం ఖరారైంది. 2018 సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ వెల్లడైంది. 51 రోజులపాటు 9 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న వాంఖడేలో తొలి మ్యాచ్‌ జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ కూడా వాంఖడేలోనే మే 27న జరగనుంది. ఈ సీజన్లో మ్యాచ్‌ల టైమింగ్స్ మార్చిన సంగతి తెలిసిందే.చెన్నైతోపాటు రెండేళ్లు సస్పెన్షన్ వేటుకు గురై.. తిరిగి బరిలోకి దిగుతున్న రాజస్థాన్ జట్టు హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 9న తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడనుంది. ఈసారి పంజాబ్ మాత్రమే ఇతర వేదికలో మ్యాచ్‌లు ఆడనుంది. ఆ జట్టు మూడు మ్యాచ్‌లను ఇండోర్‌లో, నాలుగు మ్యాచ్‌లను మొహాలీలో ఆడుతుంది.
సన్ రైజర్స్ ఆడనున్న మ్యాచ్‌ల తేదీలు..
* ఏప్రిల్ 9: హైదరాబాద్‌లో రాజస్థాన్‌తో తొలి మ్యాచ్.
* ఏప్రిల్ 12: హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్‌తో
* ఏప్రిల్ 14: కోల్‌కతా వేదికగా.. కేకేఆర్‌తో
* ఏప్రిల్ 19: ఇండోర్ వేదికగా పంజాబ్‌తో
* ఏప్రిల్ 22: సొంత గడ్డపై చెన్నైతో
* ఏప్రిల్ 24: వాంఖడేలో ముంబైతో
* ఏప్రిల్ 26: ఉప్పల్ స్టేడియంలో పంజాబ్‌తో
* ఏప్రిల్ 29: జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో
* మే 5: హైదరాబాద్ వేదికగా ఢిల్లీతో
* మే 7: సొంత గడ్డ మీద బెంగళూరుతో
* మే 10: ఫిరోజ్ షా కోట్లలో ఢిల్లీతో
* మే 13: చిదంబరం స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్‌తో
* మే 17: చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో
* మే 19: హైదరాబాద్‌లో కోల్‌కతాతో
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17674
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author