సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు : జీవన్ రెడ్డి 

సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు : జీవన్ రెడ్డి 
February 16 22:50 2018
ఆర్మూరు,
ఆర్మూర్ ఎర్రజొన్న రైతుల సమస్య ను పరిష్కరించిన సీఎం కెసిఆర్ ,మంత్రులు పోచారం ,హరీశ్ రావు ,ఎంపీ కవితల కు  ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎర్ర జొన్న రైతుల సమస్యల పై దృష్టి సారించలేదు. 2008 లో ఎర్ర జొన్న సమస్యల పరిష్కారం కోసం 8 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశానని గుర్తు చేసారు. పవర్ లో లేమనే పరేషాన్ లో ఉన్న కాంగ్రెస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారు. ..గతం లో ఎన్నడూ లేనివిధంగా క్వింటల్ కు కు 2300రూపాయలు గా నిర్ణయించాం.  .సీఎం స్వయంగా రైతు కనుకే వెంటనే స్పందించారని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటక బళ్లారి లో ఎర్రజొన్న కు 1600 రూపాయల మద్దతు ధరే ఇస్తున్నారు. సీఎం కెసిఆర్ మీద ఎర్ర జొన్న రైతులు నమ్మకం ఉంచి తమ ఆందోళన విరమించారని అన్నారు.  .స్థానిక కాంగ్రెస్ నేత సురేష్ రెడ్డి మనుషులే దీక్షల్లో పాల్గొన్నారు .రైతు లెవ్వరూ కాంగ్రెస్ మాటలు నమ్మడం లేదు. .కాంగ్రెస్ హాయంలో ఎర్ర జొన్న రైతులు బకాయిల కోసం రోడ్డెక్కితే కాల్పులు జరిపారు. ఇంత త్వరగా ఏ ఉద్యమం లోనూ పరిష్కారం లభించలేదని అన్నారు. సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉండి కూడా ఎర్ర జొన్న రైతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఇంత మద్దతు ధర ఇచ్చినా రెచ్చగొడుతున్న సురేష్ రెడ్డి ని తమదగ్గరకు రావద్దని రైతులు వెనక్కి పంపారని విమర్శించారు. .ఇంత మద్దతు ధర ఎర్ర జొన్న లకు దక్కడం చారిత్రాత్మకం. .రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎంతో చేస్తోందన అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17781
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author