తరచూ జేఎఫ్సీ భేటీలు : పవన్ కళ్యాణ్ 

తరచూ జేఎఫ్సీ భేటీలు : పవన్ కళ్యాణ్ 
February 16 22:54 2018
హైదరాబాద్,
తాను చేపట్టిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశానికి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను కూడా ఆహ్వానించానని, కానీ వారు రాలేదని, అందుకు కారణాలు తనకు తెలియవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు హైదరాబాద్ దసపల్లా హోటలో జేఎఫ్ సి తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధనేత పవన్ కల్యాణ్ తో సహ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయన్ హాజరయ్యారు. కాంగ్రెస్ తరఫునుంచి గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్ హాజరయ్యారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరఫున మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.  నేతలకు స్వయంగా పవన్ స్వాగతం పలికారు.
తొలివిడతగా భేటీ గురించి మాట్లాడుతూ జేఎఫ్సీ సమావేశాలు తరచుగా కొనసాగుతాయని పవన్ అన్నారు.  ఈ భేటీ తరువాత సబ్ కమిటీలను వేసే ఆలోచనలో ఉన్నామని కూడా పవన్ తెలియజేశారు. చాలామంది జేఎఫ్సీతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17786
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author