రిలయన్స్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ

రిలయన్స్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
February 16 23:09 2018
అమరావతి,
సమస్యలను అధిగమించి 15శాతం వృద్ది సాధించాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శుక్రవారం నాడు అయన  సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో  రిలయన్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మంత్రి రాష్ట్ర పరిస్థితులను వారికి వివరించారు. దక్షిణాది రాష్ట్రాలలో ఏపీ తలసరి ఆదాయం దక్కువగా ఉందని, పెంచే యోచనలో ఉన్నామన్నారు. అలాగే, సర్టిఫికెట్ లెస్ గవర్నెన్స్ తీసుకురావాలి అని ప్రయత్నిస్తున్నాం. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజల సమస్యలను రియల్ టైం లో తెలుసుకొని పరిష్కరిస్తున్నాం. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం తక్కువగా ఉందని అన్నారు. సమస్యలను అధిగమించి 15 శాతం వృద్ధి సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒక్కటి గానూ,2029 దేశంలో నెంబర్ వన్ స్థానంలోనూ, 2050 కి ప్రపంచంతోనూ పోటీ పడాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం ప్రాథమిక హక్కుగా మారబోతుంది. ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసాం.149 రూపాయిలకే వైఫై,ఇంటర్నెట్,టెలివిజన్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు.  రిలయన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ మీ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్,మీరు అమలు చేస్తున్న రియల్ టైం గవర్నెన్స్ మా అధినేత ముఖేష్ అంబానీని ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. రియల్ టైం గవర్నెన్స్ నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని మమ్మల్ని సెంటర్ చూడమని పంపారని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17798
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author