ఈ పాస్ విధానంతో డీలర్లు

ఈ పాస్ విధానంతో డీలర్లు
February 17 10:35 2018
నిజామాబాద్,
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ విధానం అమలు చేస్తున్నారు. జిల్లాలో 390రేషన్ దుకాణాలకుగాను.. 384రేషన్ షాపు ల్లో ఈ-పాస్ యంత్రాలతో రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 1 నుంచి ఈ-పాస్ విధానం అమలులోకి తీసుకొచ్చారు. 1,99,390 రేషన్ కార్డులుండగా.. ఇందులో ఇప్పటి వరకు 1,42,494లావాదేవీలు నిర్వహించారు. ఈ లెక్కన 71.50శాతం లావాదేవీలు విజయవంతంగా చేశారు. అత్యధికంగా ముథోల్ మండలంలో 83.1శాతం, అత్యల్పంగా పెంబి మండలంలో 53.1శాతం లావాదేవీలు పూర్తి చేశారు. రెండో విడతలో భాగంగా ఆరు జిల్లాల్లో ఈ విధా నం అమలు చేస్తుండగా.. నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, పూర్వ నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండో విడతలో ఈ-పాస్ విధానం అమలవుతుండగా.. నిర్మల్ ముందంజలో ఉంది.ఈ-పాస్ యంత్రాలపై అమలు విధానంపై డీలర్లకు గతంలోనే అవగాహన తరగతులు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా డీలర్లకు జిల్లా కేంద్రంలో ఈ-పాస్ యంత్రాల వినియోగంపై సాంకేతిక నిపుణులతో అవగాహన కల్పించారు. ఈ నెల ఒకటి నుంచి ఈ-పాస్ విధానంలో రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ విధానంతో బినామీ కార్డులకు చెక్ పడింది. తూకంలో మోసాలకు అడ్డుకట్ట వేసినట్లయింది. గతంలో ఎంఎల్‌ఎస్ పాయింట్ (మండల స్థాయి నిల్వ కేంద్రం) నుంచి వచ్చే సంచుల్లో కొంత తరుగు రాగా… డీలర్లు లబ్ధిదారులకు ఇచ్చే సరుకుల్లోనూ కొంత కోత పెట్టాల్సి వచ్చేది. తాజాగా ఎంఎల్‌ఎస్ పాయింట్‌లోనూ డీలర్లు ఎలక్ట్రానిక్ కాంటాలతో తూకం వేసుకుని వెళ్తున్నారు. ఈ -పాస్ విధానంతో ఎలాంటి సమస్య లేకుండా పకడ్బందీగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఆధార్‌కార్డుకు అనుసంధానం చేయటంతో కుటుంబంలోని సభ్యుల్లో ఎవరో ఒకరు తప్పనిసరిగా రేషన్ దుకాణానికి వచ్చి వేలిముద్రలు వేస్తేనే సరుకులు ఇస్తారు. దీంతో బినామీకార్డులకు, లబ్ధిదారులు కాకుండా వేరేవారు రా కుండా అడ్డుకట్ట పడుతుంది. ఎలక్ట్రానిక్ కాం టాల ద్వారా తూకం వేసి ఇస్తుండడంతో మోసాలకు చెక్ పడింది. తూకం తక్కువగా ఉన్న, ఎక్కువగా ఉన్నా రసీదు రాదు. దీంతో సరుకుల పం పి ణీ, తూకంలో పారదర్శకత మరింత మెరుగైంది. జిల్లాలో 384 దుకాణాల్లో ఈ-పాస్ విధానం అమలు చేస్తుండగా… 19 దుకాణాల్లో మాత్రం సాంకేతికపరమైన ఇబ్బందులు వచ్చాయి. నెట్‌వర్క్ సరిగా లేకపోవడంతో సరుకుల పంపిణీకి అంతరాయం ఏర్పడుతోంది. ఈ-పాస్ యంత్రాలకు ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డులు వాడుతున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సరిగా లేకపోవటంతో సిగ్నల్ సమస్య ఏర్పడుతోంది. పెంబి, దస్తురాబాద్, తానూర్, కుభీర్, కడెంతో పాటు మైదాన మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ఇలాంటి సమస్యలున్నాయి. దీంతో ఈ-పాస్ యంత్రాలు పని చేయడం లేదు.ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు చర్య లు చేపడుతున్నారు. ఈ-పాస్ యంత్రాలు సక్రమంగా వినియోగించేందుకు ఆరుగురు మంది సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఏవైన సమస్యలు వస్తే.. అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య కూడా పలు రేషన్ దుకాణాలను సందర్శించి.. అమలు తీరును పర్యవేక్షించారు. కొన్ని గ్రామాల్లో నెట్‌వర్క్ సమస్యతో పాటు సర్వరు డౌన్ అవుతుండటంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కో లబ్దిదారుడికి 10-15నిమిషాల సమయం పడుతోంది. వృద్ధులకు వేలిముద్రలు సరిగా రావటం లేదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు సాంకేతిక సిబ్బందితో పాటు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ-పాస్ యం త్రాల వినియోగంలో సమస్యలు, సందేహాలు వస్తే పరిష్కరించేందుకు డీఎస్‌వో కార్యాలయం లో ప్రత్యేక హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేశారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17810
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author