బన్నీకి ఫిదా అయిన ప్రియా

బన్నీకి ఫిదా అయిన ప్రియా
February 17 12:05 2018
తిరువనంతపురం,
క్యూట్‌గా కన్ను గీటి.. నెటిజన్ల గుండెలు కొల్లగొట్టిన ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. ఆమె వీడియో చూసి స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫిదా అయిపోయాడు. బన్నీకి మలయాళీ సినీ పరిశ్రమతో కూడా పరిచయం ఉండటంతో ఆ వీడియో చూసి స్పందించకుండా ఉండలేకపోయాడు. ‘‘ఈ మధ్యకాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియోను నేను అస్సలు చూడలేదు. సింప్లిసిటీకి ఉన్న పవరే అది. నాకు చాలా బాగా నచ్చేసింది’’ అని ట్వీట్ చేశాడు.బన్నీ చేసిన ఈ కామెంట్స్ ప్రియా చెవిన కూడా పడ్డాయి. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘మా వీడియోకు అభిమానుల నుంచి వచ్చిన ఆదరణకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్‌ను మరిచిపోలేను. కేరళలో బన్నీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు’’ అంటూ మురిసిపోయింది.సోగకళ్ల చిన్నది, త్వరలో తెలుగు తెరపై కూడా కనిపించనుంది. నిఖిల్‌ తర్వాతి చిత్రం కోసం నిర్మాతలు ఆమెను సంప్రదించినట్లు తెలిసింది. మరి, ఈ మలయాళ కుట్టి అల్లువారి అబ్బాయితో ఎప్పుడు నటిస్తుందో చూడాలి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17850
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author