సోమవారం నుండి ఎర్రజొన్న కొనుగోళ్లు : పోచారం

సోమవారం నుండి ఎర్రజొన్న కొనుగోళ్లు : పోచారం
February 17 17:32 2018
హైదరాబాద్
ఎర్రజొన్నల కొనుగోలు విధివిధానాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి శనివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్ధసారది, కమీషనర్ యం. జగన్మోహన్, అడిషినల్ డైరెక్టర్ విజయ్ కుమార్, మార్క్ ఫెడ్ జనరల్ మేనేజర్  రాములు ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు జిల్లాలలో ఎర్రజొన్న పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం యాబై వేల ఎకరాలలో సాగయింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మార్క్ ఫెడ్ ద్వారా వచ్చే సోమవారం (పిబ్రవరి 19) నుండి ఎర్రజొన్నలను క్వింటాలుకు రూ. 2300 తో కొనుగోలు చేస్తామన్నారు. మొదటి దశలో 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం, అవసరాన్ని బట్టి సెంటర్లను పెంచుతాం. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, వేల్పూర్, కమ్మరపల్లి, బాల్కొండ వ్యవసాయ మార్కెట్ కేంద్రాలలో సెంటర్ల ఏర్పాటు చేస్తున్నాం. రైతులు మార్కెట్ కు ఎర్రజొన్నలను తీసుకురావడానికి టోకెన్ పద్దతిని అమలు చేస్తామన్నారు. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు  గ్రామాలలో పర్యటించి రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించి విస్తీర్ణం, దిగుబడి ఆధారంగా టోకెన్లను జారీ చేస్తారు. టోకేన్ తేది ఆదారంగా రైతులు తమ సరుకును కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను అధికారులకు తెలపాలి. అమ్మిన పంట తాలుకు నగదును నేరుగా రైతుల ఖాతాలో జమచేస్తామని అన్నారు. ఈ ఏడాది పండిన పంటను మాత్రమే కొనుగోలు చేస్తాం. గౌడాన్లు, కోల్డ్ స్టోరేజీలలో నిల్వ ఉన్న గత ఏడాది నిల్వలను కొనుగోలు చేయమని మంత్రి స్పష్టం చేసారు. ఎవరైనా పాత నిల్వలను అమ్మడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.అలాగే, ఇతర రాష్ట్రాల నుండి ఎర్రజొన్నల దిగుమతులను అనుమతించమని అన్నారు. పోలీసు శాఖ సహకారంతో చెక్ పోస్టులు, తనిఖీలను నిర్వహించాలి. ఎర్రజొన్నల కొనుగోలు, సరఫరా, తరలింపు, నిల్వ చేయడంపై వ్యవసాయ, రెవిన్యూ. మార్కెటింగ్, మార్క్ ఫెడ్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారని మంత్రి వెల్లడించారు. నిజమైన రైతులు ఆందోళన చెందవద్దు, చివరి గింజ కొనే వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తామని మంత్రి అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17885
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author